వీళ్లసలు తల్లిదండ్రులేనా..? మద్యం కొనుక్కునేందుకు డబ్బుల్లేక 2 నెలల కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు..!

ABN , First Publish Date - 2022-06-22T01:28:38+05:30 IST

పచ్చనోట్ల కోసం కన్న ప్రేమను అమ్మేశారు.. మద్యానికి బానిసలై పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు..

వీళ్లసలు తల్లిదండ్రులేనా..? మద్యం కొనుక్కునేందుకు డబ్బుల్లేక 2 నెలల కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు..!

పచ్చనోట్ల కోసం కన్న ప్రేమను అమ్మేశారు.. మద్యానికి బానిసలై పశువుల కన్నా హీనంగా ప్రవర్తించారు.. మద్యం కొనుక్కునేందుకు డబ్బుల్లేక 2 నెలల కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన వెలుగు చూసింది.. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆ చిన్నారిని కొనుక్కున్న వ్యక్తి వెనక్కి తిరిగి ఇచ్చేశాడు.. ఆ తల్లిదండ్రులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

ఇద్దరు అమ్మాయిలు.. మూడేళ్లుగా స్నేహం.. సడన్‌గా ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్.. కోర్టుకు చేరిన కథ..!


లఖింపూర్ ఖేరీలోని మొహమ్మదీ కొత్వాలి ప్రాంతానికి చెందిన జగ్తార్ సింగ్, అతని భార్య మద్యానికి బానిసలు. వీరిద్దరూ తరచుగా మద్యం సేవించేవారు. రోజూ మద్యం సేవించడానికి డబ్బులు సరిపోకపోవడంతో తమ రెండు నెలల కొడుకును అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నారు. మధ్యవర్తి ద్వారా మాట్లాడుకుని పిల్లలు లేని నిజాముద్దీన్ అనే వ్యక్తికి తమ కొడుకును రూ.30 వేలకు అమ్మేశారు. అయితే వీరు వేరే మతానికి చెందిన వ్యక్తికి కొడుకును అమ్మడం కుల పెద్దలకు నచ్చలేదు. 


వారు పెద్ద సంఖ్యలో స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రెండు వర్గాలకు సంబంధించినది కావడంతో పోలీసు శాఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చిన్నారిని కొన్న వ్యక్తి ఆచూకీ తెలుసుకుని అతడిని స్టేషన్‌కు పిలిపించారు. అతడు ఆ చిన్నారిని జగ్తార్ సింగ్ దంపతులకు తిరిగి ఇచ్చేశాడు. ఆ భార్యాభర్తలిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2022-06-22T01:28:38+05:30 IST