మహిళను కాబట్టే అలా మాట్లాడారు: పరిణీతి

May 31 2021 @ 22:36PM

సమస్య ఏదైనా గొంత్తెత్తి పోరాడతారు బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా. తన జీవితంలోని ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి ఆమె మాట్లాడారు. తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వెల్లడించారు. ‘‘మన దేశంలో పితృస్వామ్యం అనేది కొనసాగుతూనే ఉంది. ఓ అమ్మాయి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు లేకుండా పోయింది. రోజులు మారుతున్నా సమాజంలో ఇదే పెద్ద సమస్యగా కనిపిస్తోంది. నేను ఎదుర్కొన్న ఓ విషయాన్ని చెబుతా. నా ఇంటిని రెనోవేట్‌ చేయాలని ఓ కాంట్రాక్టర్‌ని పిలిచా. అతను నాకేమీ తెలీదని భావించి ఇంకెవరూ లేరా మాట్లాడటానికి అన్నాడు. ఎందుకంటే నేను మహిళని కాబట్టి. ‘ఇది నా ఇల్లు.. నాకు నచ్చిన పని చేయించుకుంటా. డబ్బులు ఇచ్చేది నేనే అయినప్పుడు ఇంకెవరు మాట్లాడాలి’ అని ఘాటుగా స్పందించా. అలాగే సమాజంలో సెక్సిజం కూడా ఇలాగే ఉంది’’ అని ఆమె చెప్పారు. ఇంకా మాట్లాడుతూ ‘‘నేనొక చిన్న టౌన్‌లో పెరిగిన అమ్మాయిని. మా అమ్మ ఇంట్లో నలుగురితో కూర్చుని భోజనం చేయడానికి ఇష్టపడదు. మగవాళ్లు తిని, పడుకునే వరకు తినకూడదు అంటుంది. తను ఇప్పటికీ అదే పద్ధతిలో ఉంది. అలాంటివి నాకు నచ్చవు’’ అని పరిణీతి అన్నారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.