అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : పరిపూర్ణానంద

ABN , First Publish Date - 2020-09-23T18:26:56+05:30 IST

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమలలో

అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : పరిపూర్ణానంద

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. జగన్ హిందువు అని, క్రైస్తవుడని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడే... అయినా... డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో స్వామి పరిపూర్ణానంద బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. డిక్లరేషన్ వ్యవస్థ హిందువులు పెట్టింది కాదని, ఆంగ్లేయులే 42 పాయింట్స్ తో డిక్లరేషన్ ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.


హిందువులు కాని వారు తిరుమలను దర్శించుకోవాలంటే సంతకం పెట్టాలన్న నిబంధన డిక్లరేషన్‌లో చాలా ముఖ్యమైందని ఆయన తెలిపారు. కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన కూడా తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్వామీజీ డిమాండ్ చేశారు. గబ్బిలాల లాంటి నాయకుల వల్లే దేవాలయాలకు కరోనా వచ్చిందని, మంత్రి నానికి కరోనా వచ్చిందో, మెదడు పాడైందో తెలియదని తీవ్రంగా విమర్శించారు.


ఈ విషయంపై జగన్ వెంటనే స్పందిచాలని, లేదంటే కేంద్ర జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. మసీదులకు, చర్చిలకు ఉన్న స్వయం ప్రతిపత్తి దేవాలయాలకు ప్రభుత్వాలు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. ప్రభుత్వాలకు సిగ్గు, లజ్జ ఉంటే దేవాలయాలను ఇచ్చేయాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-23T18:26:56+05:30 IST