పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN , First Publish Date - 2022-07-06T06:50:23+05:30 IST

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలి
బాపులపాడులో ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంపీపీ నగేష్‌

హనుమాన్‌జంక్షన్‌, జూలై 5 : పరిసరాల పరిశుభ్రతతోనే డెంగ్యూలాంటి విషజ్వరాలను దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకో వచ్చని బాపులపాడు ఎంపీపీ వై.నగేష్‌ అన్నారు. బాపులపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి మంజూష ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా మంగళవారం బాపులపాడులో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.పార్ధసారధి, గన్నవరం మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి రామాంజనే యులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, వైద్యఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : వీరవల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మంగళవారం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ సందర్భంగా  అవగాహ నా ర్యాలీ నిర్వహించారు. వర్షపునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందుతాయని, వాటి వల్ల డెంగ్యూ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్యాధికారి ఎస్‌.ఎన్‌.ఎస్‌.గోపాల్‌ హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కిరణ్మయి, ఎంపీహెచ్‌వోలు శ్రీనివాస్‌, స్వామి, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ రామాంజనేయులు, ఏపీఎంవో వెంకటపతిరాజు, పీహెచ్‌ఎన్‌ సౌదామణి, శాంతకుమారి, ప్రేమలీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:50:23+05:30 IST