పరిశ్రమలతో వలసలకు అడ్డుకట్ట వేయండి

ABN , First Publish Date - 2022-05-16T05:13:31+05:30 IST

కడప, అన్నమయ్య జిల్లాల్లో పరిశ్ర మలు ఏర్పాటు చేసి యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి ఎల్‌.రాజశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పరిశ్రమలతో వలసలకు అడ్డుకట్ట వేయండి
సమావేశంలో ప్రసంగిస్తున్న పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌

రాజంపేట, మే15 : కడప, అన్నమయ్య జిల్లాల్లో  పరిశ్ర మలు ఏర్పాటు చేసి యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి ఎల్‌.రాజశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాజంపేట పట్టణంలో జరిగిన పీడీఎస్‌ యూ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు.  కడప, అన్నమయ్య జిల్లాల్లోని యువకులు స్థానికంగా ఉద్యోగాలు దొరకక గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లడం  బాధాకరమన్నారు. ఈవిషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాల విభజ నలో రాజంపేటకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర సహాక కార్యదర్శి ఎం.అంకన్నమాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెకు ్టను పునర్నిర్మించాలని, లేకపోతే రైతులు కూడా వలస వెళతారని, పట్టణంలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వర, నాగేంద్రబాబు, జిల్లా కోశాధికారి జోకీశ్వర్‌, కార్యవర్గ సభ్యులు సుబ్బరాయుడు, సుదర్శన పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T05:13:31+05:30 IST