పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక నజర్‌

ABN , First Publish Date - 2020-11-21T04:26:55+05:30 IST

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక నజర్‌

పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక నజర్‌
చెత్తసేకరణ చేస్తున్న దృశ్యం

రోజువారి పనులపై చెక్‌లిస్ట్‌ ఇవ్వాలి 

జవాన్లకు దిశా నిర్దేశం


మహబూబ్‌నగర్‌, నవంబరు 20: మునిసిపాలి టీ అనగానే చెత్త సేకరణ ఒక సముద్రం.. ఎక్కడ ఎవరు పని చేస్తున్నారు.. ఎంత చెత్త సేకరణ చేస్తున్నారు.. అటోలు ఎక్కడ తిరుగుతున్నాయి.. జవాన్‌లు ఏం పని చేస్తున్నారో తెలియని పరిస్థితి. దీంతో ఎంత పని చేసినా నగరాన్ని క్లీన్‌గా ఉంచే పరిస్థితి లేకపోవడంతో ప్రణాళికాబద్ధంగా చెత్త సేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. శానిటిరీ జవాన్‌లో రోజువారి ఏం పని చేస్తున్నా రు.. ఎంత పని చేశారో చెక్‌లిస్ట్‌ సమర్పించాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల క్రితమే సిబ్బందితో అడిషినల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ దిశాని ర్దేశం చేశారు. ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం అమలవుతుందా లేదా పరిశీలించాలి. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి స్వచ్ఛ ఆటోలకు ఇస్తున్నారో లేదో గమ నించాలి. ఇంటి నుంచి చెత్త సేకరణ ఎన్ని రోజుకో సారి చేస్తున్నారో తేదీలతో చూడాలి. ఒక రోజు ఒక వాహనం ద్వారా పొడి చెత్తను ఎన్ని కిలోలు సేకరించారు. ఎన్ని కిలోలు డీఆ ర్‌సీసీకి అందజేశారో నోట్‌ చే యాలి. అదేవిధంగా ఒక్కో వాహనం ద్వారా ఎన్నికిలోల తడిచెత్తను సేకరించి కంపోస్ట్‌ యార్డులో ఇచ్చారో కూడా నోట్‌ చేయాలి. ఆయా వార్డుల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎక్కువ చెత్త వేసే ప్రాంతాలను గుర్తించారు.. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు.. ఎంతమందికి ఫైన్‌లు వేశారు. ఎంత మందికి హెచ్చరికలు జారీ చేశారో ఆధారాలతో సమర్పించా లి. ప్రతి రోజూ ఎన్ని మీటర్లు డ్రైనేజీలో చెత్త తీశా రు. ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఊడిచారో కూడా వివ రాలు సేకరించాలి. అదేవిధంగా ఆయా వార్డుల్లో ఉన్న పబ్లిక్‌ టాయ్‌లెట్లను తనిఖీ చేశారా అవి శుభ్రంగా ఉన్నాయా.. లేకుంటే ఏం చర్యలు తీసు కున్నారు వంటి వివరాలన్నీ ప్రతిరోజూ సేక రించి ఆయా వార్డు జవాన్‌ పేరు రాసి సంతకం చేసి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు చెక్‌లిస్ట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల పారిశుధ్య నిర్వహణ మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు. 


Updated Date - 2020-11-21T04:26:55+05:30 IST