పార్లమెంటును రద్దు చేస్తే మేమూ ఎన్నికలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-28T09:27:24+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి.. ప్రజలు అధికారం ఇచ్చే పరిస్థితిలో లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న

పార్లమెంటును రద్దు చేస్తే మేమూ ఎన్నికలకు సిద్ధం

- ప్రధాని మోదీకి ఏ రాష్ట్రంలోనూ..సీఎంలు స్వాగతం పలకడం లేదు 

- మంత్రులు తలసాని, గంగుల

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి.. ప్రజలు అధికారం ఇచ్చే పరిస్థితిలో లేరు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీకు దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయండి. మా ముఖ్యమంత్రిని ఒప్పించి మేం కూడా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాం’’ అని మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, గంగుల కమలాకర్‌ అన్నా రు. శుక్రవారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.  ప్రధాని గతంలో ‘భారత్‌ బయోటెక్‌’కు వచ్చినపుడు సీఎం కేసీఆర్‌ను రావొద్ద ని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయని, అప్పటి నుంచే కొత్త సంప్రదాయానికి బీజం పడిందని చెప్పారు. తెలంగాణలోనే కాదు.. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా ప్రధాని మోదీకి అక్కడి సీఎంలు స్వాగతం పలకడంలేదని తెలిపారు. ఎంపీ లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ..  బీజేపీ జాతీయ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ బీజేపీలోని కుటుంబ పాలనపై మాట్లాడాలన్నారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. గత ప్రధానులు ఎవరూ అనుసరించని వింత విధానాలతో మోదీ నియంత పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.  

Updated Date - 2022-05-28T09:27:24+05:30 IST