Advertisement

పార్లమెంట్.. వ్యూహం

Sep 28 2020 @ 10:36AM

బలోపేతం దిశగా టీడీపీ అడుగులు

నియోజకవర్గం యూనిట్‌గా అధ్యక్షుల నియామకం

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అధి ష్ఠానం పార్లమెంట్‌ వ్యూహంతో రంగంలోకి దిగింది. ఇంత కాలం జిల్లాను యూనిట్‌గా చేశారు. తాజాగా పార్లమెంట్‌ నియోజక వర్గ స్థానాలను యూనిట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ స్థానాలకు ప్రత్యేకంగా కమిటీలను వేశారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ యూనిట్‌గా నాయ కత్వం పటిష్ఠంగా పనిచేసిన ప్రాం తంలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఇదే పంథాలో పార్టీని పరుగులు తీయించాలని పార్లమెంట్‌ స్థానాల వారీగా కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ అధిష్ఠానం బాధ్యతలను నిర్ధేశించింది. 


పార్టీ బలో పేతమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 2024లో ఏపీలో పసుపు జెండాను ఎగుర వేయించాలని వ్యూహాలు రచిస్తో న్నారు. ఇందుకుగాను ఇప్పటి నుంచే కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీకి జిల్లా, మం డల, గ్రామ, పట్టణ, నగర కమి టీలు ఉన్న విషయం తెలిసిందే. జిల్లా కార్య వర్గంలో ఉన్న కొంత మంది నా యకులు ఆ పద విని విజిటింగ్‌ కార్డులకు పరిమతం చేసి కాల క్షేపం చేస్తున్నట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చిం ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ పరిస్థితుల్లో జనంలోకి నా యకులు, కార్యకర్తలు చొచ్చుకు వెళ్లేలా.. కొత్త నాయకత్వాన్ని తయారు చేసేలా పార్లమెంట్‌ వ్యూహాన్ని అనుసరించాలని అధినేత నిర్ణయించారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానాలు యూనిట్‌గా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్‌  యూనిట్‌గా పార్టీ కమిటీలు ఉంటే దాని పరిధిలో కార్యకలాపాల నిర్వ హణ, పార్టీ వ్యూహ రచన తేలిగ్గా ఉంటుందన్న ఉద్ధేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


పార్లమెంట్‌ స్థానాలకు అధ్యక్షులను, సమన్వయకర్తలను అధినేత ఆదివారం నియమించారు. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక ఇన్‌చార్జిను రాష్ట్ర పార్టీ నియ మించింది.   జిల్లాలోని మూడు పార్లమెంట్‌ నియోజక వర్గాలలో చిర పరిచితులుగా ఉన్న నాయకులను అధి ష్ఠానం గుర్తించి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. జిల్లా లోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల లో విస్తరించిన బాపట్ల లోక్‌సభ స్థానానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును నియమించారు. 


పార్టీలో సీనియర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌కు గుంటూరు లోకసభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గ పరిధిలో తాడికొండ, ప్రత్తిపాడు రిజర్వ్‌ సీట్లు ఉన్నాయి.  నియోజకవర్గ పరిధి లో ఆలపాటి, ధూళిపాళ్ల, లోకేశ్‌ వంటి హేమాహేమీల సూచనలతో శ్రావణ్‌ రాజధాని ప్రాంతంలో టీడీపీ జెండాను రెపరెపలాడించడానికి వ్యూహరచన చేయాల్సి ఉంది రాజధాని తరలింపుపై జరుగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి చెందిన శ్రావణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమలో పోటీ చేసిన అభ్యర్థులు వైసీపీ గూటికి చేరారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చే యాల్సి ఉంది. గుంటూరు పశ్చిమ స్థానాన్ని కోవెలమూడి నానికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఈయన్ను గుంటూరు మేయర్‌ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఇప్పటికే నగరంలో ఓ విడత ప్రచారం కూడా చేశారు. ప్రత్తిపాడులో ప్రస్తుతం మాజీ మంత్రి మాకినేని పెద్ద రత్తయ్య పరిశీలు కుడిగా పార్టీ భారాన్ని మోస్తున్నారు. 


పల్నాడు ప్రాంతంలో విస్తరించిన నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను నియమించారు. 20 ఏళ్ల నుంచి జీవీ వినుకొండ నియోజకవర్గ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సుమారు ఆరేళ్లగా ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన వినుకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ నరసరావుపేట లోకసభ పరిధిలో ఉంది. అక్కడ ఎంపీగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు వయోభారంతో ఉన్నారు. దీంతో జీవీకి ఇక్కడి బాధ్యత అప్పగించారు. ఈ నియోజక వర్గ పరిధిలో సీని యర్లుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లా రావు, యరపతినేని శ్రీనివాసరావు,  కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరుల సూ చనలతో  జీవీ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు వస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 


ప్రకాశం, గుంటూరు జిల్లాలో విస్తరించిన బాపట్ల లోకసభ అధ్యక్ష పీఠాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అప్పగించారు. ఈ నియోజకవర్గంలో ప్రకాశంలో నాలుగు, గుంటూరులో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో పరిధి పర్చూరు, అద్దంకి, చీరాల, రేపల్లె స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తరువాత జరిగిన పరిణామాల్లో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి, బాపట్లలో ఓడిన అన్నం సతీష్‌ బీజేపీలో చేరారు. మాజీ మంత్రి ఆనంద్‌బాబు (వేమూరు), రేపల్లె నుంచి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసా ద్‌ సీనియర్లుగా ఉన్నారు.   బాపట్లలో ఇప్పటికే   నరేం ద్రవర్మకు బాధ్యతలు అప్పగించారు. 


ప్రజా సమస్యలపై పోరు

నరసరావుపేట:  ప్రజా సమస్యల పరి ష్కా రానికి అలుపెరగని పోరాటం చేస్తానని నరస రావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడి గా నియమితులైన జీవీ ఆంజనేయులు తెలి పారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. నాయకులు, కార్యకర్త ల మధ్య ఐక్యత తీసుకువచి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ విజ యమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. త్వరలో  న రసరావుపేటలో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పల్నాడు జిల్లాకు అధ్యక్షుడిగా నియమితులైన ఆంజనేయులుకు నరసరావుపేట ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు  అభినందనలు తెలిపారు. 


సమన్వయకర్తలు..

గుంటూరు పార్లమెంట్‌ సమన్వయకర్తగా విజయ నగరానికి చెందిన సీనియర్‌ నేత కొండపల్లి అప్పల నాయుడుని నియమించారు. ఆయన గుంటూ రుతో పాటు మచిలీపట్నం బాధ్యతలను చూడనున్నారు. నరసరావుపేట, బాపట్ల స్థానాలను పశ్చిమ గోదా వరి జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పర్యవేక్షించనున్నారు. 


కలిసికట్టుగా పని చేస్తాం: పార్టీకి పూర్వ వైభవం తెస్తాం

నేతలమంతా కలిసి కట్టుగా పని చేస్తామని బాపట్ల పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్య క్షు డిగా నియమితులైన ఏలూరి సాంబశివరావు తెలిపారు.  పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామ న్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కంటికి కనిపించ కుం డా పేదలపై భారాలు మోపుతోందన్నారు. రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ పంపుసెట్లకు మీటర్లు బిగించి సబ్సిడీ ఎత్తే సే ఆలోచనలో ఉందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తెస్తామన్నారు. సీనియర్‌ నేతల సూచనలు, సలహాలు తీసుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలో పేతం చేస్తామన్నారు. 


సమన్వయంతో ముందుకు: బాధ్యతకు వంద శాతం న్యాయం చేస్తా

అందరి నేతలను సమన్వయ పరుచు కుంటూ పార్టీని ముందుకు తీసు కెళ్తానని గుంటూరు పార్ల మెం ట్‌ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియ మితులైన తెనాలి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల కల్లా పార్టీని మరింత బలోపేతం చేయటమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకు తగ్గట్లుగా నియోజవకర్గ పరిధిలోని సీనియర్లతో మాట్లాడి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటామన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి 2024లో తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేలా లక్ష్యాలను రూపొందిస్తా మన్నారు. అధినేత చంద్రబాబు  అప్పగించిన బాధ్యతకు వంద శాతం న్యాయం చేస్తానని తెలిపారు.


జిల్లా నేతలకు కీలక పదవులు

జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులకు అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు విజయవాడ, ఏలూరు  పార్లమెంట్‌ స్థానాల సమన్యయకర్తగా కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు అరకు పార్లమెంట్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆనందబాబు       ఇదే పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా వ్యవరించారు. 


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.