Partha Chatterjee: కుక్కల కోసం ప్రత్యేకంగా లగ్జరీ ఫ్లాట్

ABN , First Publish Date - 2022-07-25T19:59:05+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన టీచర్స్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త ..

Partha Chatterjee: కుక్కల కోసం ప్రత్యేకంగా లగ్జరీ ఫ్లాట్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన టీచర్స్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఈ స్కామ్‌లో పశ్చిమబెంగాల్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్ధ ఛటర్జీని అరెస్టు చేసిన అనంతరం ఈడీ చేపట్టిన దర్యాప్తులో లెక్కల్లో చూపించని పలు ఆస్తులు ఆయనకు ఉన్నట్టు గుర్తించింది. పశ్చిమబెంగాల్‌లోని డైమండ్ సిటీలో ఆయనకు మూడు ఫ్లాట్లు ఉండగా, ఇందులో ఒకటి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఫ్లాట్. దీనికి ప్రత్యేకంగా తన పెంపుడు కుక్కల కోసమే ఆయన కేటాయించారు.


స్కూల్ సర్కీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్కామ్‌లో పార్థ ఛటర్జీని శనివారం ఉదయం ఈడీ అరెస్టు చేసింది. మంత్రికి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ కోల్‌కతా నివాసంలో రూ.21 కోట్ల నగదు, కోటి రూపాయలు విలువ చేసే నగలు వెలుగుచూడటం పార్థ ఛటర్జీ అరెస్టుకు దారితీసింది. 69 ఏళ్ల ఛటర్జీకి చెందిన పలు ఫ్లాట్లలో ఒక ఫ్లాట్‌ను నటి అర్పిత ముఖర్జీకి ఆయన కానుకగా ఇచ్చారు. ఆ ఫ్లాట్‌లోనే ఈ నగదు పట్టుబడింది. 18/D, 19/D, 20/D ఫ్లాట్‌లు కూడా పార్థ ఛటర్జీ సొంతమేనని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి తోడు, బోల్‌పూర్‌లోని శాంతినికేతన్‌లో ఒక ఫ్లాట్ పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీ పేర్లపై జాయింట్‌గా ఉంది. శాంతినికేతన్‌లోని ఏడు ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లపై ఈడీ కన్నేసింది.

Updated Date - 2022-07-25T19:59:05+05:30 IST