Arpita Mukherjees LIC policies: అర్పితాముఖర్జీ ఎల్ఐసీ పాలసీల బాగోతం

ABN , First Publish Date - 2022-08-05T15:05:58+05:30 IST

పశ్చిమబెంగాల్(west bengal) రాష్ట్రంలో వెలుగుచూసిన టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ(Arpita Mukherjee) పాత్రపై...

Arpita Mukherjees LIC policies: అర్పితాముఖర్జీ ఎల్ఐసీ పాలసీల బాగోతం

నామినీగా మాజీమంత్రి పార్థాచటర్జీ పేరు...

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్(west bengal) రాష్ట్రంలో వెలుగుచూసిన టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ(Arpita Mukherjee) పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(arpita mukherjee ed) తవ్వేకొద్దీ పలు బాగోతాలు(arpita mukherjee news) వెలుగుచూస్తున్నాయి. ప్రముఖ సినీనటి (actress), మోడల్(model) అయిన అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా పాలసీల్లో(LIC policies) నామినీగా(nominee) పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ(Former West Bengal minister Partha Chatterjee) పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 


సినిమాల్లో(cinima), మోడలింగ్ రంగాల్లో రాణించిన అర్పితాముఖర్జీకి సోషల్ మీడియాలో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు.అర్పితా గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం((married) జరిగినా ఆమె భర్త(husband) పేరు వెల్లడించలేదు.భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్‌లో ఉన్నారో, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది వెల్లడించలేదు. కాని అర్పితాకు చెందిన 31 ఎల్ఐసీ పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టడంపై పలు రకాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగుచూడటంతో పార్థాచటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.


 పార్థా ఛటర్జీ,అర్పితా ముఖర్జీలిద్దరూ 2012వ సంవత్సరం జనవరి 1 వతేదీన ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్ కింద భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. వీరిద్దరి పేర్లపై కొన్న ఆస్తులపై ఈడీ విచారణ సాగిస్తోంది. పలు ఆస్తులు అర్పితా, పార్థాచటర్జీల పేరుతో కొనుగోలు చేసినా, దీనికి నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది తేలలేదు.అర్పితా ఫ్లాట్లలో కోట్లాదిరూపాయల నగదు, 5కిలోల బంగారం, పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈడీ అధికారుల సోదాల్లో దొరికాయి.మొత్తంమీద టీచర్ల రిక్రూట్ మెంటు స్కాంలో మాజీ మంత్రి పార్థాచటర్జీతోపాటు అర్పితాముఖర్జీ పాత్ర కూడా ఉందని ఈడీ దర్యాప్తులో వెలుగుచూసింది. 


Updated Date - 2022-08-05T15:05:58+05:30 IST