SSC Scam: రాత్రి కూడా రైస్ ఇవ్వరూ...జైలు అధికారులకు పార్థా ఛటర్జీ విన్నపం

ABN , First Publish Date - 2022-08-08T22:55:51+05:30 IST

ఎస్ఎస్ఎసీ స్కామ్‌లో చిక్కుకుని ప్రస్తుతం ప్రెసిడెన్సీ జైలు వార్డులో ఉంటున్న పశ్చిమబెంగాల్..

SSC Scam: రాత్రి కూడా రైస్ ఇవ్వరూ...జైలు అధికారులకు పార్థా ఛటర్జీ విన్నపం

కోల్‌కతా: ఎస్ఎస్ఎసీ స్కామ్ (SSC Scam)లో చిక్కుకుని ప్రస్తుతం ప్రెసిడెన్సీ జైలు (presidency jail) వార్డులో ఉంటున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ (partha chatterjee) రోజులో ఎక్కువ సమయంలో నిద్రలోనే గడుపుతున్నారట. జైలు మెనులో మార్పు చేసి, తనకు రాత్రి కూడా రైస్ ఇవ్వాలని అధికారులను కోరినట్టు సమాచారం.


ఒకే బాత్‌రూమ్...

పార్థా ఛటర్జీని ఉంచిన జైలు వార్డులో ఒకే బాత్‌రూం ఉంది. దోషులుగా శిక్ష పడిన వారు, విచారణ ఖైదీలు అందులోనే స్నానం చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన కాలివాపు (Swollen feet)తో సెల్ విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు. ఆదివారం ఉదయం ఆయన శారీరక పరిస్థితిను పరీక్షించిన వైద్యులు జైలు నుంచి ఆసుపత్రికి తీసుకు వెళ్లమని మాత్రం సూచించలేదు. వాకింగ్ తగ్గడమే కాళ్ల వాపునకు కారణమని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది.


జైలు నిబంధనల ప్రకారం చూస్తే, స్నానం కోసం విచారణ ఖైదీలు, జైలు శిక్షపడిన ఖైదీలు ఒకే టాయిలెట్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మాజీ మంత్రిని ఉంచిన నెంబర్ 2 సెల్‌లో ఒకే బాత్‌రూమ్ ఉంది. శుక్రవారం నాడే ఆయన జైలుకు వచ్చినప్పటికీ స్నానం చేయలేదు. తాను నడవలేకపోతున్నానని ఆదివారం ఆయన వైద్యుల ముందు వాపోయారు. దీంతో ఆయన వార్డు ముందు ఒక పెద్ద నీళ్ల డ్రమ్ ఉంచారు. ప్లాస్టిక్ మగ్‌తో నీళ్లు తీసుకుని ఎలాగో ఆయన స్నానం కానిచ్చారు. ఆయనకు అదనంగా ఒక తువాలును జైలు సిబ్బంది ఇచ్చారు.


ఇక.. మధ్యాహ్నం ఆయన స్నానం కోసం సెల్ బయటకు వచ్చినప్పుడు, ఇతర సెల్స్‌లోని ఉన్నవారిని తమ సెల్స్‌ నుంచి బయటకు రాకుండా తాళాలు వేసేస్తున్నారు. కేవలం స్నానం చేసే సమయంలోనే కాకుండా ఆయన వార్డు బయటకు రావాలనుకున్న ప్రతిసారి జైలులోని ఖైదీలను గదుల్లోనే ఉంచుతున్నారు. ఆయన ఉంటున్న సెల్‌‌పై నిరంతర నిఘా కోసం సీసీటీవీ ఏర్పాటు చేశారు. ఆ వార్డులోని వివిధ సెల్స్‌లో అఫ్తాబ్ అన్సారి, సుదీప్తో సెన్, గౌతమ్ కుందు, కదెర్ ఖాన్, ముసా వంటి పేరున్న దోషులు ఉంటున్నారు. ఛాత్రధర్ మహత, పలువురు మావోయిస్టు అండర్‌ట్రైల్స్‌ కూడా అక్కడే ఉంటున్నారు.


రోజంతా నిద్రే....

కాగా, మాజీ మంత్రి రోజంతా ఇంచుమించు నిద్రలోనే గడిపేస్తున్నారట. డాక్టర్లు విజిట్‌కు వచ్చినప్పుడు, స్నానానికి వెళ్లడానికి ముందు కూడా ఆయన నిద్రకే పరిమితమవుతున్నారు. బట్టర్‌తో కూడిన బిస్కెట్లు ఉదయం ఇస్తున్నారు. మాంసాహారం ఒక్క ఆదివారాల్లోనే ఇస్తారు. మధ్యాహ్నం ఆయనకు అన్నం, పప్పు, కూర, చేపరసం ఇచ్చారు. రాత్రులు కూడా రైస్ ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.


మరోవైపు, అలిపూర్ మహిళా జైలులో ఉన్న అర్పితా ముఖర్జీ సైతం ఎక్కువ సమయం నిద్రకే కేటాయిస్తున్నారని చెబుతున్నారు. అక్కడ కూడా ఉదయం టీ-బిస్కట్ బట్టర్ టోస్ట్ ఇస్తున్నారు. అన్నం, పప్పు, కూర, ఫిష్ వంటివి మధ్యాహ్నం ఇస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ప్రత్యేక సెల్‌లో ఉంచి, కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

Updated Date - 2022-08-08T22:55:51+05:30 IST