ltrScrptTheme3

కామెడీ జానర్‌లో భాగ్‌సాలే

Oct 26 2021 @ 04:58AM

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘భాగ్‌ సాలే’. సోమవారం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత డి. సురేష్‌ బాబు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ క్లాప్‌ ఇచ్చారు. క్రైమ్‌ కామెడీ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో యష్‌ రంగినేని, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజీవ్‌ కనకాల, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.