ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-08-03T04:54:39+05:30 IST

దాదాపు 30 సంవత్సరాల పాటు అంకితభావంతో పోలీసు శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తించుకుంటుందని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో జూలై నెలలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని సోమవారం ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి : ఎస్పీ
పదవీ విరమణ పొందిన సిబ్బందిని సత్కరించిన ఎస్పీ

కడప(క్రైం), ఆగస్టు 2: దాదాపు 30 సంవత్సరాల పాటు అంకితభావంతో పోలీసు శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తించుకుంటుందని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో జూలై నెలలో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని సోమవారం ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కుటుంబ జీవితాలు త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. డయల్‌ 100లో సుదీర్ఘ కాలం సేవలందించిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పెద్దుల్‌రెడ్డి, ఏఆర్‌ ఎస్‌ఐ విజయరాజు, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బరాయుడు, పదవీ విరమణ పొందారని, వారి కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ (ఆపరేషన్‌) దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, ట్రెజరర్‌ గంగరాజు, ఉపాధ్యక్షుడు శంకర్‌, ఆర్‌ఐ శ్రీనివాసులు, మహబూబ్‌బాష, జార్జ్‌, సోమశేఖర్‌నాయక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్రముఖ ప్రజ్ఞాశాలి బళ్లారి రాఘవ

తెలుగు నాటకరంగ ప్రముఖులు, బహుముఖ ప్రజ్ఞాశాలి బళ్లారి రాఘవ (తాడిపత్రి రాఘవాచార్యులు) అని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ కొనియాడారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బళ్లారి రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేదని, కొద్ది కాలంలోనే ఆయన న్యాయవాదిగా, క్రిమినల్‌ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందారన్నారు. 

Updated Date - 2021-08-03T04:54:39+05:30 IST