సాహసమే ఊపిరి

ABN , First Publish Date - 2021-01-17T06:22:52+05:30 IST

సాహసమే ఊపిరిగా సాగుతున్నాడు పర్వతారోహకుడు ఉపేంద్ర. సామాన్యులకు అసాధ్యమైన, ప్రపంచంలోని ఎత్తైన మంచుప ర్వతాలను అధిరోహిస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు.

సాహసమే ఊపిరి

పర్వతారోహణలో మేటి ఉపేంద్ర

కిలిమంజారో ఎక్కేసిన వైనం

ఎవరె్‌స్టపైకెళ్లేందుకుసన్నాహాలు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 16: సాహసమే ఊపిరిగా సాగుతున్నాడు పర్వతారోహకుడు ఉపేంద్ర. సామాన్యులకు అసాధ్యమైన, ప్రపంచంలోని ఎత్తైన మంచుప ర్వతాలను అధిరోహిస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. గుత్తి మండలంలోని ఇసురాళ్లపల్లికి చెందిన పేద రైతు కృష్ణమూర్తి, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు ఉపేంద్ర.  ఇప్ప టికే కిలిమంజారో, లఢక్‌స్టాక్‌కాంగ్రి పర్వతాలను అధిరోహిం చి వాటిపై త్రివర్ణప తాకాన్ని ఎగురవేశాడు. ఇక అత్యంత ఎత్త్తెన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని నిత్యం సాధన చేస్తున్నాడు. అందుకు తమ ఆర్థిక పరిస్థితి సరిపోదని, దా తలు సహకరిస్తే సాధిస్తానంటున్నాడు.


ఉపేంద్ర జైత్రయాత్ర ఇలా..

2017 ఏప్రిల్‌ 8వతేదీ నుంచి మే 8వరకు శిక్షణ తీసుకున్న ఉపేంద్ర 18వేల అడుగుల నీరతాంగ్‌ గ్రేసియా పర్వతాన్ని అధిరోహించాడు. డార్జిలింగ్‌లోని 18206అడుగుల బీసీరాయ్‌ కొండ, 14వేల అడుగులున్న లఢక్‌స్టాక్‌కాంగ్రి పర్వతాన్ని ఎక్కాడు. నీరతాంగ్‌గ్రేసియాలో ఐస్‌వాల్‌పై త్రివర్ణపతాకన్ని ఎగురువేశాడు. నేషనల్‌ ఇనిస్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటేరియన్‌ కోర్సులో చేరి హిమాలయ మౌంటనింగ్‌లో శిక్షణ పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి శిక్షణకు వెళ్లిన 12 మంది బ్యాచ్‌లో ఉపేంద్ర 8వేల అడుగుల ఎత్తైన కొండపై ఆర్మీ శిక్షణ పొందాడు. అప్పట్లో ఎవరెస్ట్‌ ఎక్కేందుకు నిర్వహించిన సెలెక్షన్స్‌లో ఉపేంద్రకు నిరాశ ఎదురైంది. కానీ అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర సహాయ సహకారాలతో జాతీయ మత్స్యకారుల సంఘం ఆర్థిక సాయంతో కిలిమంజారో అధిరోహించాడు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో ఇప్పటికీ సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్‌ సందర్శనకు అనుమతిస్తారు. అప్పటిలోగా దాతల నుంచి నిధులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు.


దాతలు సహకరిస్తే ఎవరెస్ట్‌ అధిరోహిస్తా

మాది నిరుపేద రైతు కుటుంబం. ఆర్డ్స్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. మాకున్న ఆర్థిక వనరులతో కిలిమంజారో, లఢక్‌ స్టాక్‌కాంగ్రి పర్వతాలను ఇప్పటికే ఎక్కాను. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధి రోహించడమే నా  ఏకైక లక్ష్యం. అందుకు కనీసం రూ.25లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు. ఆర్థిక సాయం కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను, ఆర్డీటీ వారిని కలిసి విన్నవించాను. దాతలు ఎవరైనా ముందు కొస్తే అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి జిల్లా, రాష్ట్ర, దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేస్తా. 

- ఉపేంద్ర, పర్వతారోహకుడు



Updated Date - 2021-01-17T06:22:52+05:30 IST