ఎన్నాళ్లిలా?

ABN , First Publish Date - 2020-08-08T09:08:17+05:30 IST

పార్వతీపురం ఐటీడీఏకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సబ్‌ప్లాన్‌ మండలాలు అధికం.

ఎన్నాళ్లిలా?

ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్న ఐటీడీఏ

పూర్తిస్థాయి పీవో నియామకం ఎప్పుడో?


(పార్వతీపురం): పార్వతీపురం ఐటీడీఏకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సబ్‌ప్లాన్‌ మండలాలు అధికం. కానీ పూరిస్థాయిలో పీవో లేక  పాలన సజావుగా సాగడం లేదు. ఇన్‌చార్జిలే దిక్కవుతున్నారు. వారు మాతృశాఖ పనులు, ఇటు ఇన్‌చార్జి బాధ్యతలు చూడడానికి సతమతమవుతున్నారు. సొంత శాఖ పనులకే పరిమితమవుతున్నారు.


ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖకు జిల్లాకు చెందిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె డిప్యూటీ సీఎం కూడా. దీంతో పార్వతీపురం ఐటీడీఏలో సమస్యలు పరిష్కారమవుతాయని..పూర్తిస్థాయి పీవో నియామకం జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇంతవరకూ పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌గా నియమితులైన విధేఖారేను ఇన్‌చార్జి పీవోగా ప్రభుత్వం నియమించింది. దీంతో పూర్తిస్థాయి అధికారి నియామకం ఇప్పట్లో లేనట్టేనని తేటతెల్లమ

Updated Date - 2020-08-08T09:08:17+05:30 IST