పాస్‌.. అంతా తూచ్‌!

ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST

రైతుల వివరాలతో సహా ఎ రువుల అమ్మకాల వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఎరువుల వ్యాపారికి పాస్‌ యం త్రాలను పంపిణీ చేసింది.

పాస్‌.. అంతా తూచ్‌!
పాస్‌ యంత్రం


పాయింట్‌ ఆఫ్‌ స్కేల్‌ యంత్రాలను వినియోగించని ఎరువుల వ్యాపారులు

ప్రభుత్వ ఆదేశాలు కిందిస్థాయిలో ఉష్‌కాకి

ఎరువులను ఇచ్చేసి ఆ తరువాత రైతుల  పేర్లను నమోదు చేస్తున్న వైనం

బోధన్‌, మే 8 : రైతుల వివరాలతో సహా ఎ రువుల అమ్మకాల వివరాలన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఎరువుల వ్యాపారికి పాస్‌ యం త్రాలను పంపిణీ చేసింది. పాస్‌ అంటే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాలుగా ప్రభుత్వం పేర్లను పెట్టి వీటిని వ్యాపారులకు అందించింది. అయితే పాస్‌ యంత్రాలు ఉత్తిత్తువే అన్నట్లు త యారైంది. ఎక్కడ పాస్‌ యంత్రాలను ఉపయోగించి రైతులకు ఎరువులను విక్రయించడం లేదు. ఎరువుల వ్యాపారులు ఎరు వులను తీసుకొని వాటిని గోదాంలలో నిల్వ చేసి రైతులకు ఇష్టా నుసారంగా విక్రయిస్తూ తమకు వీలున్నప్పుడు పాస్‌ యం త్రాలలో రైతుల పేర్లను నమోదు చేస్తూ వారి వేలి ముద్రలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఓ సదుద్దేశంతో ఎరువులు పక్క దారి పట్టకుండా ఎరువుల విక్రయాల్లో పారదర్శకత ఉండాలన్న మంచి నిర్ణయంతో పాస్‌ యంత్రాలను అమల్లోకి తెస్తే అవి క్షేత్రస్థాయిలో మూలన పడ్డాయి. పాస్‌ యంత్రాల వినియోగం సగానికి పైగా సగం ఎరువుల షాపుల్లో ఎక్కడా అమల్లో లేవు. సీజన్‌ల వారీగా డీలర్లు కొనుగోలు చేసిన ఎరువుల వివరాలు, అమ్మకం వివరాలు, తీసుకున్న రైతుల వివరాలు అంతా ఆన్‌ లైన్‌లో నమోదవ్వాలని, ఎరువుల విక్రయాల్లో ఎక్కడా వ్యత్యా సం లేకుండా అవినీతి చోటు చేసుకోకుండా ఎరువులు పక్క దారి పట్టకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం పాస్‌ యంత్రాలను ఎరువుల వ్యాపారులకు అందజేసింది. ప్రతీ ఎరువుల వ్యాపారి తప్పనిసరిగా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యం త్రాల్లో ఎరువుల విక్రయాల్లో వినియోగించాలి. పాస్‌ యం త్రాలు వినియోగించకుండా ఎరువుల విక్రయాలు జరిపితే అలాంటి ఎరువుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసు కోవడంపై వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేస్తూ పాస్‌ యంత్రా లను స్వాధీనం చేసుకోవాలి. కానీ ఎక్కడా క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. పాస్‌ యంత్రాలతో ఉన్న లెక్కల ప్రకా రమే ఎరువుల వ్యాపారి దుకాణం, గోదాములలో ఎరువుల ని ల్వలు ఉండాలి. ఏ ఒక్క బస్తా తేడా వచ్చినా వ్యాపారి లైసెన్స్‌ రద్దు కావాలి. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు ఎరువుల వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా ఎరువులను విక్రయాలు జరిపి సాయంత్రానికో లేదంటే మరుసటి రోజుకో పాస్‌యంత్రాల్లో రైతుల పేర్లను తప్పుల తడకగా నమోదు చేసి లెక్కలు సరిచేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బహిరంగంగానే జరుగుతున్నా అటు వ్యవ సాయశాఖ, ఇటు విజిలెన్స్‌శాఖలు కనీసం నోరు మెదపడం లేదు. ప్రతియేటా వానాకాలం సీజన్‌ ప్రారంభంలో ప్రభుత్వ ఆ దేశాల మేరకు మొక్కుబడిగా పోలీసు, రెవెన్యూ, వ్యవసా యశాఖలు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి ఎరువుల దుకా ణాలు తనిఖీ చేయడం స్టాక్‌ రిజిష్టర్‌లను పైపైనే పరిశీలిం చడం.. ఆ తరువాత చేతులు దులుపుకోవడం పరిపాటిగా మా రింది. పాస్‌ యంత్రాల వినియోగం, పాస్‌ యంత్రాల ప్రకారం ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయా లేదా పాస్‌లో ఉన్న లెక్కల ప్రకారం వ్యాపారి దుకాణం, గోదాములలో ఎరువులు ఉన్నాయా లేదా అన్నది ఎక్కడా లెక్క చూడడం లేదు. అంతా రిజిష్టర్‌లకే పరిమితమై చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో పక్కదారి పడుతున్న అధికార యంత్రాంగమే అందుకు సహకరిస్తున్నారు. 

పాస్‌ యంత్రాలతో ఎక్కడా ఎరువుల అమ్మకాలు

జిల్లాలో ఎరువుల వ్యాపారుల అందరికీ తెలంగాణ ప్రభు త్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ పాస్‌ యంత్రాలను పం పిణీ చేసింది. పాస్‌ యంత్రాలతోనే ఎరువుల విక్రయాలు జర గాలి. రైతుల వివరాలతో సహ ఎరువుల అమ్మకాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. దీనికోసం ప్రతీ ఎరువుల వ్యాపారి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పాస్‌) యంత్రాలను తప్పనిసరి వినియో గించాలి. ఎరువుల వ్యాపారులు పాస్‌ యంత్రాలను విని యోగించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయశాఖది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా పాస్‌ యంత్రాల వినియోగించడంలేదు. ఎరువుల షాపుల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాస్‌ యంత్రాలను పెట్టి అంతా షరా మామూలే అన్నట్లుగా ఎరువు ల విక్రయాలు కానిస్తున్నారు. ఆ తరువాత ఎరువుల విక్ర యాలను లెక్క తప్పకుండా తమకు అనుకూలంగా పాస్‌ యం త్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. ఎరువుల వ్యాపారుల మా యాజాలంతో ఫార్స్‌ యంత్రాలుగా మారాయి. పాస్‌ యంత్రాల వినియోగం లేక ఎరువుల వినియోగాల ప్రక్రియ అడ్డగోలుగా మారింది. పాస్‌ యంత్రాలు ఎరువుల విక్రయాల్లో కీలకమని వ్యవసాయశాఖ చెబుతున్నా ప్రభుత్వ ఆదేశాలున్నా క్షేత్రస్థాయి లో అది అమలుకు నోచుకోవడం లేదు. పర్యవేక్షించాల్సిన అధి కారులే వీటి వినియోగం పట్ల పెదవి విరుస్తున్నారు. ఎరువుల లెక్కలు ఇతర తనిఖీలు అనే సరికి వ్యవసాయశాఖ అధికారులే పాస్‌ యంత్రాలు ఉన్నాయని ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదని ఎరువుల వ్యాపారులకు ఊతం ఇచ్చేలా అవినీతి తంతు ను ప్రోత్సహించేలా కీతాబులిస్తుండడం కొసమెరుపు. మరోవైపు పాస్‌ యంత్రాల వినియోగంలో పర్యవేక్షణ లోపంపై వ్యవసా య శాఖ అధికారులపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వ్యవ సాయశాఖ అధికారులే క్షేత్రస్థాయిలో సీజన్‌కు రెండు పర్యా యాలు వానాకాలం, యాసంగి సీజన్‌ ప్రారంభంలో షాపు ల ను మొక్కుబడిగా తనిఖీలు చేయడం షాపుల స్థాయిని బట్టి వసూళ్లను దండుకోవడం పరిపాటిగా మారింది. రెండు సీజన్‌ల కుగానూ రెండు పర్యాయాలు వ్యవసాయశాఖ అధికారులు రు ణమోప్రణమో తీసుకోవడం తమకేమీ పట్టన్నట్లుగా వ్య వహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి. 

పాస్‌ యంత్రాలు వినియోగంలోకి వచ్చేనా...?

జిల్లాలో అన్ని మండలాల్లో ఎరువుల డీలర్ల వద్ద ఉన్న పాస్‌ యంత్రాలు వినియోగంలోకి వచ్చేనా లేదా అన్నది సం దిగ్ధంగా మారింది. వ్యవసాయశాఖ అధికారిక లెక్కల ప్రకారం అన్ని ఎరువుల షాపుల్లో పాస్‌ యంత్రాలు ఉన్నాయని వాటి ద్వారానే ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయని లెక్కలు చె బుతున్నాయని కానీ క్షేత్రస్థాయిలో మండల కేంద్రాలు, గ్రా మీణ ప్రాంతాలలో పాస్‌ యంత్రాల వినియోగం లేకుండానే ఎరువుల దందా సాగిపోతుంది. పాస్‌ యంత్రాలు వాడని ఎరువుల వ్యాపారుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఉన్నత అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. ఈ ఏడాది వానకాలం సీజన్‌ నుంచి ఎరువుల వ్యాపారులు పాస్‌ యంత్రాలు లేకుండా ఎరు వుల విక్రయాలు జరిపితే లైసెన్స్‌లు రద్దు చేయడంతోపాటు దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హె చ్చరికలు జారీ చేస్తోంది. ఇవి క్షేత్రస్థాయిలో ఎలా అమ లవుతాయో వేచి చూడాలి మరి. పాస్‌లో ఉన్న లెక్కల ప్రకా రం ఎరువుల వ్యాపారుల దుకాణం, గోదాముల్లో ఎరువుల నిల్వలు లెక్కలు సరిచూస్తాయో లేదో వేచి చూడాలి. సీజన్‌లో జరిగే అధికారుల తనిఖీలు మొక్కుబడి కాకుండా పకడ్బందీగా కొనసాగుతే ఎరువుల వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టపడే ప్రమాదం ఉంది. వ్యవసాయశాఖ, విజిలెన్స్‌ తనిఖీలు దా డులు ముందస్తు సమాచారం లేకుండా కొనసాగితే ఎరువుల దందాల అక్రమాలకు చెక్‌ పడే అవకాశం ఉంది. పాస్‌ యంత్రాల అంతటా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-08T05:30:00+05:30 IST