రైలులో టీ తాగిన ప్రయాణికుడికి షాక్.. కప్పు టీ రూ.70.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-01T20:36:07+05:30 IST

దేశంలోని ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చుకుంటే రైళ్లలో ప్రయాణం చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది.

రైలులో టీ తాగిన ప్రయాణికుడికి షాక్.. కప్పు టీ రూ.70.. అసలు విషయం ఏంటంటే..

దేశంలోని ఇతర రవాణా వ్యవస్థలతో పోల్చుకుంటే రైళ్లలో ప్రయాణం చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. సౌకర్యవంతమైన ప్రయాణం, తక్కువ డబ్బులకే ఆహారం వంటి కారణాలతో ఎక్కువ మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే తాజాగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో టీ తాగిన ఓ ప్రయాణికుడికి రైల్వే శాఖ షాకిచ్చింది. ఎందుకంటే ఆ టీ వెల 70 రూపాయలు. షాకైన ప్రయాణికుడు బిల్ అడిగాడు. ఆ బిల్లు చూసి మరింత షాకయ్యాడు. 


ఇది కూడా చదవండి..

Viral Video: ఓరి నాయనో.. ఒక్క బైక్‌పై ఏడుగురా..? ఒకరి తర్వాత మరొకరిని ఎలా ఎక్కించుకున్నాడో మీరే చూడండి..!


 జూన్‌ 28న ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి భోపాల్‌కు shatabadi expressలో ప్రయాణించాడు.  రైలు ప్రయాణ సమయంలో ఐఆర్‌సీటీసీ సిబ్బంది నుంచి టీ కొన్నాడు. వారు వేసిన బిల్ చూసి షాకయ్యాడు. ఎందుకంటే కప్పు టీ ఖరీదు రూ.20 కాగా, రూ.50 సర్వీస్‌ చార్జీ అదనంగా వసూలు చేశారు. షాకైన ప్రయాణికుడు ఆ బిల్లును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయ్యింది. ఒక కప్పు టీ కోసం 70 రూపాయలు వసూలు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రైల్వే అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. 


సర్వీస్‌ చార్జీకి సంబంధించి 2018లో జారీ చేసిన నోటీస్ ప్రకారం రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో ప్రయాణికుడు టీ, కాఫీ లేదా ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పుడు సర్వీస్‌ చార్జీగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక కప్పు టీ లేదా కాఫీకి అయినా సరే ఈ సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-01T20:36:07+05:30 IST