Kuwait విమానాశ్రయంలో కోవిడ్ కలకలం.. విమానం దిగగానే పీసీఆర్ టెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..

Published: Mon, 06 Sep 2021 17:49:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Kuwait విమానాశ్రయంలో కోవిడ్ కలకలం.. విమానం దిగగానే పీసీఆర్ టెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: కువైట్ విమానాశ్రయంలో కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్ తేలడంతో అధికారులంతా షాక్ తిన్నారు. కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా కువైత్‌లో విమానాల రాకపోకలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ మధ్యనే మళ్లీ విమానాశ్రయాలను తెరిచింది అక్కడి విమానాయాన శాఖ. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రయాణికులను ఇతర దేశాల నుంచి వచ్చేందుకు అనుమతులిస్తోంది. అలాగే వచ్చిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం విమానాశ్రయంలో వేరే దేశాల నుంచి కువైత్ చేరుకున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలైన పీసీఆర్ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఓ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు తేలింది. అతడి శరీరంలో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఉందని ఫలితాలొచ్చాయి.

ఈ ఘటనపై ఎయిర్‌‌పోర్ట్‌లోని కరోనా ప్రివెన్షన్ కమిటీ ప్రధాన అధికారి డాక్టర్ ఖలీల్ అల్ జారల్లా స్పందించారు. పక్క దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు గుర్తించామన్నారు. అతడిని వెంటనే క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. విదేశాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అలా చేస్తేనే కోవిడ్ మహమ్మారి తిరిగి దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతామని అన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ ఓ ట్విస్ట్ ఏంటంటే.. కోవిడ్ బారిన పడిన వ్యక్తి విదేశాలకు చెందిన వ్యక్తి కాదట. కువైట్‌‌కు చెందిన వ్యక్తే ఈ మహమ్మారి బారిన పడ్డాడట. ఖలీల్ స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.