అదే పనిగా ఎమర్జెన్సీ హారన్‌ను మోగిస్తున్న లోకో పైలట్.. ఏం జరిగిందో తెలియక ప్రయాణీకుల్లో టెన్షన్.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-21T00:14:14+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని రాయ్‌పూర్‌ స్టేషన్ నుంచి బయలుదేరిన ఇంటర్‌సిటీ రైలు ఒక చిన్న స్టేషన్‌కు చేరుకుంది.

అదే పనిగా ఎమర్జెన్సీ హారన్‌ను మోగిస్తున్న లోకో పైలట్.. ఏం జరిగిందో తెలియక ప్రయాణీకుల్లో టెన్షన్.. చివరకు..

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని రాయ్‌పూర్‌ స్టేషన్ నుంచి బయలుదేరిన ఇంటర్‌సిటీ రైలు ఒక చిన్న స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఆ ట్రైన్‌కు హాల్ట్ లేదు. అయినా లోకో పైలెట్ అక్కడ ట్రైన్ ఆపి అదే పనిగా హారన్ మోగించాడు. ఏం జరిగిందోననే అనుమానంతో ఆ స్టేషన్ సిబ్బంది హడావుడిగా రైలు వద్దకు చేరుకున్నారు. ఆ రైలులో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వ్యక్తి గుండెనొప్పితో బాధపడుతున్నట్టు తెలుసుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మందిర్  హసౌద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 16 ఏళ్ల బాలిక.. దగ్గరకు తీసి ఏమైందని పోలీసులు అడిగితే ఆమె చెప్పింది విని..


62 ఏళ్ల అశోక్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాయ్‌పూర్‌లో ఇంటర్‌సిటీ రైలు ఎక్కాడు. రైలు కొంత దూరం వెళ్లగానే అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించింది. గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే టీసీని సంప్రదించి సమాచారం అందించారు. అతను వెంటనే లోకో పైలెట్‌కు విషయం చెప్పాడు. రైలు ఆ సమయంలో మందిర్  హసౌద్ రైల్వే స్టేషన్‌ దగ్గర్లో ఉంది. ఆ రైలుకు అక్కడ హాల్ట్ లేదు. అయినా లోకో పైలెట్ ఆ స్టేషన్‌లో రైలుని నిలిపివేసి హారన్ కొట్టడం ప్రారంభించాడు. 


ఆ హారన్ విని స్టేషన్ సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి రైలు వద్దకు పరిగెత్తారు. అశోక్ ఉన్న భోగీ దగ్గరకు వెళ్లి అతడిని రైలు దించారు. హోరుగా వర్షం కురుస్తుండడంతో ఆంబులెన్స్‌ను నేరుగా ప్లాట్‌ఫామ్‌ దగ్గరకే తీసుకెళ్లారు. ఆంబులెన్స్ ఎక్కించి హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-09-21T00:14:14+05:30 IST