విమానంలో ప్రయాణికుడి అరాచకం..అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

ABN , First Publish Date - 2022-05-09T01:24:44+05:30 IST

అమెరికాలో ఓ విమాన ప్రయాణికుడు(57) తాజాగా అరాచకం సృష్టించాడు. అందరూ చూస్తుండగా.. ఒక్కసారిగా విమానం ఎమర్జెన్సీ తలుపు తెరిచి రెక్కలపై పరిగెత్తాడు. ఆ తరువాత..

విమానంలో ప్రయాణికుడి అరాచకం..అకస్మాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఓ విమాన ప్రయాణికుడు(57) తాజాగా అరాచకం సృష్టించాడు. అందరూ చూస్తుండగా.. ఒక్కసారిగా విమానం ఎమర్జెన్సీ తలుపు తెరిచి రెక్కలపై పరిగెత్తాడు. ఆ తరువాత.. నేల మీదకు దూకేశాడు. చికాగోలోని ఓ హారే అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఎయిర్‌పోర్టు సిబ్బంది అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అతడు శాన్‌డియాగో నుంచి యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో చికాగోకు వచ్చినట్టు  పోలీసులు తెలిపారు. విమానం ల్యాండయ్యాక గేట్ వద్దకు వస్తున్న క్రమంలో అతడు ఇలా చేసినట్టు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం.. ఇతర ప్యాసింజర్లు యథావిథిగా విమానం దిగిపోయారు. ఈ ఘటన వల్ల ఎయిర్‌పోర్టు కార్యకలాపాల్లో ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు.   





Updated Date - 2022-05-09T01:24:44+05:30 IST

Read more