ప్రయాణికుడి హల్‌చల్.. ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి, విమానం రెక్కపై నడుస్తూ..

ABN , First Publish Date - 2022-05-07T19:06:50+05:30 IST

రన్నింగ్‌లో ఉన్న విమానంలోని ఓ ప్రయాణికుడు హల్​చల్​ చేశాడు. కొద్దిసేపు విమానంలోని తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశాడు.

ప్రయాణికుడి హల్‌చల్.. ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి, విమానం రెక్కపై నడుస్తూ..

చికాగో: రన్నింగ్‌లో ఉన్న విమానంలోని ఓ ప్రయాణికుడు హల్​చల్​ చేశాడు. కొద్దిసేపు విమానంలోని తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశాడు. మరికాపేట్లో విమానం టెర్మినల్​ చేరుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్​ చేశాడు. అనంతరం విమానం రెక్కపై నడవడం మొదలెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) చోటు చేసుకుంది. కాగా, ఈ దుశ్చర్యకు పాల్పడిన ఆ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బంది అదుపు చేసేలోపు రెక్కల మీదకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశాడు. దాంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ర్యాండీ ఫ్రాంక్​ డెవిలా(57)గా పోలీసులు గుర్తించారు. శాండియాగో నుంచి వస్తున్న ఈ విమానం ల్యాండ్​ అవగానే కిందకు దూకేసిన ర్యాండీ.. ఫ్లైట్​ను టెర్మినల్​కు చెర్చేందుకు పైలట్లకు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతడి బాధ్యతరాహిత్యమైన చర్య నేపథ్యంలో చికాగో పోలీసులు రిమాండ్​కు తరలించారు. జూన్ 27న కోర్టులో హాజపరుస్తామని పోలీసులు వెల్లడించారు. 

Read more