రద్దీగా ఉన్న బస్టాండ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న పసిపాప.. ఏమైందా అని అక్కడ వెళ్లిన ప్రయాణికులు.. కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-12-20T00:59:23+05:30 IST

అప్పుడప్పుడే బస్సులు ఆ బస్టాండ్‌కు చేరుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో చిన్నపిల్లల ఏడుపు శబ్దం రావడం మొదలైంది. అయితే మొదట ప్రయాణికులు దాన్ని లై

రద్దీగా ఉన్న బస్టాండ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న పసిపాప.. ఏమైందా అని అక్కడ వెళ్లిన ప్రయాణికులు.. కనిపించిన సీన్ చూసి..

ఇంటర్నెట్ డెస్క్: అప్పుడప్పుడే బస్సులు ఆ బస్టాండ్‌కు చేరుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో చిన్నపిల్లల ఏడుపు శబ్దం రావడం మొదలైంది. అయితే మొదట ప్రయాణికులు దాన్ని లైట్ తీసుకున్నారు. కానీ.. సమయం గడుస్తున్నా.. ఆ పసిపాప ఏడుపు చప్పుడు వినిపిస్తుండటంతో.. ప్రయాణికులకు సందేహం కలిగింది. దీంతో ఏడుపు శబ్దం వచ్చే వైపు వెళ్లారు. అనంతరం అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉదయం 6 అవుతుండటంతో హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉన్న బస్టాండ్‌కు బస్సులు అప్పుడప్పుడే వస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో ఆ బస్టాండ్ అంతా కలకలలాడుతోంది. ఇంతలో ప్రయాణికులకు నవజాత శిశువు ఏడుపు చప్పుడు వినిపించింది. ఎవరి బిజీలో వాళ్లు ఉన్నందువల్ల మొదటగా ఆ ఏడుపును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. సమయం గడుస్తున్నా ఆ ఏడుపు చప్పుడు అలాగే వినిపించడంతో.. ప్రయాణికులకు సందేహం కలిగింది. దీంతో శబ్దం వచ్చే వైపు వెళ్లారు. అనంతరం ఎముకలు కొరికే చలిలో.. ఓ ప్లాస్టిక్ టబ్‌లో అప్పుడే పుట్టిన పాపను చూసి చలించిపోయారు. ఆ నవజాత శిశువుకు సంబంధించిన వాళ్లు ఎవరూ అక్కడ కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ పాపను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-12-20T00:59:23+05:30 IST