IndiGo విమానంలోని ప్రయాణికుడి ఫోన్‌లో మంటలు

ABN , First Publish Date - 2022-04-15T15:23:37+05:30 IST

అసోం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడి ఫోన్‌లో మంటలు చెలరేగాయి....

IndiGo విమానంలోని ప్రయాణికుడి ఫోన్‌లో మంటలు

న్యూఢిల్లీ : అసోం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడి ఫోన్‌లో మంటలు చెలరేగాయి.అసోంలోని దిబ్రూఘడ్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో ప్రయాణికుడి ఫోన్ నుంచి పొగలు రావడాన్ని క్యాబిన్ సిబ్బంది చూశారు.క్యాబిన్ సిబ్బంది మంటలను ఆర్పివేశారని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఎ అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు.ఫ్లైట్ నంబరు 6ఈ 2037 అసోంలోని డిబ్రూఘర్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా విమాన క్యాబిన్ సిబ్బంది ఒక ప్రయాణికుడి ఫోన్ నుండి నిప్పురవ్వలు పొగ రావడం చూశారు.ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌కు మంటలు అంటుకున్నాయి. అనంతరం గురువారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఇండిగో సిబ్బంది చెప్పారు.

Updated Date - 2022-04-15T15:23:37+05:30 IST