పశుమిత్ర శిక్షణను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-07-02T04:58:59+05:30 IST

వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో 60 రోజుల పాటు ఇచ్చే పశుమిత్ర శిక్షణను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌బాబు కోరారు.

పశుమిత్ర శిక్షణను సద్వినియోగం చేసుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కేవిఎన్‌చక్రధర్‌బాబు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 వెంకటాచలం, జూలై 1: వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో 60 రోజుల పాటు ఇచ్చే పశుమిత్ర శిక్షణను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కేవిఎన్‌ చక్రధర్‌బాబు కోరారు. ఆయన శుక్రవారం పశుమిత్ర శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణలో పశువైద్యులు అందించే బోధన, క్షేత్ర పరిశీలన ద్వారా పాడిఉత్పత్తులపై గ్రామీణ యువత అవగాహన పెంచుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. ఆజాదీసే అంత్యోదయ తక్‌ కేంద్ర పథకానికి రాష్ట్రంలో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలను ఎంపికచేశారన్నారు. శిక్షణ పూర్తిచేసుకుని ఆసక్తి కలిగిన యువతకు పాడిపరిశ్రమ యూనిట్లు ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా తక్కువవడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి,  పశుసంవర్థకశాఖ జేడీ మహేశ్వరుడు, డీడీ సురేష్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనే జర్‌ శ్రీకాంత్‌ ప్రదీప్‌కుమార్‌, నాబార్డు డీడీఎం రవిసింగ్‌, యూనియన్‌ బ్యాంకు ఆర్‌ఎం జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T04:58:59+05:30 IST