మరమ్మతు పనులు పరిశీలిస్తున్న డీఈ వెంకటేశ్వరావు
ఆంద్రజ్యోతి ఎఫెక్ట్
అనంతసాగరం, మే 26: రెండేళ్లుగా మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్న సోమశిలలోని సీపీడబ్ల్యూఎస్ తాగునీటి పథకం మరమ్మతు పనులు ఎట్టకేలకు ప్రారంభమైయ్యాయి. ఇటీవల ఆంద్రజ్యోతిలో గొంతులో గరళం అనే కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేలా రూ.39లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పథకాన్ని వినియోగంలోకి తెచ్చేలా మరమ్మతులు ప్రారంభించారు. త్వరలో ఈ పథకం వినియోగంలోకి వస్తుందని డీఈ వెంకటేశ్వరావు, ఏఈ సుదర్శన్ తెలిపారు.