ఢిల్లీలో బండి సంజయ్‌ని కలిసిన పటేల్‌

Jun 14 2021 @ 00:00AM
బండి సంజయ్‌ను సన్మానిస్తున్న మోహన్‌రావు పటేల్‌

బీజేపీ అధిష్టానం దృష్టికి భైంసా సమస్యలు

భైంసా, జూన్‌ 14 : భైంసాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ నాయకుడు మోహన్‌రావు పటేల్‌ సోమవారం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిశారు. ఢిల్లీలో మాజీ మంత్రి ఈటెల రాజేంధర్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ తదితరులు బీజేపీలో చేరిన సందర్భంగా మోహన్‌రావు పటేల్‌ కూడా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ను కలిసి ఆయనను సత్కరించారు. ఆ తరువాత భైంసా పరిస్థితులను బండి సంజయ్‌కు వివరించారు. ఇటీవల జరిగిన అల్లర్లు, ఆ అల్లర్లలో పోలీసులు ఒకే వర్గం వారిని టార్గెట్‌ చేసి కేసులు పెట్టారంటూ ఫిర్యా దు చేశారు. దీంతో పాటు భైంసాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా భైంసా ప్రాంతం లో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటు విషయం కూడా ఆయన చర్చించారు. బండి సంజయ్‌ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు, మౌళిక సౌకర్యాలు, ఉపాధి అవకాశాల మెరుగుదల లాంటి అంశాలను కేంద్ర సర్కారు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అలాగే పార్టీ సీనియర్‌ నాయకులతో మోహన్‌రావు పటేల్‌ వివిధ రకాల సమస్యలపై చర్చించారు. 


Follow Us on: