వంటలు

పత్తర్‌ కా ఘోష్‌

పత్తర్‌ కా ఘోష్‌

నోరూరించే నవాబీ రుచులు

హైదరాబాదీ రుచులంటే నోరూరని వారుండరు. ముఖ్యంగా నిజాం కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన కొన్ని వంటలు  ఒక్కసారైనా రుచిచూడాలని అనుకుంటారు. దహీ కే కబాబ్‌,  దమ్‌ కీ నల్లీ, పత్తర్‌ కా ఘోష్‌ వంటి రెసిపీలు ఆ కోవకు చెందినవే. వాటిని నవాబీ స్టైల్‌లో ఎలా తయారుచేసుకోవాలో ఈ వారం మీకోసం...


నిజాంల వంటగదిలో పుట్టిన ఎన్నో అద్భుతమైన వంటకాలలో పత్తర్‌ కా ఘోష్‌ కూడా ఒకటి. ఇప్పటికీ హైదరాబాదీ ఫేవరేట్‌ డిష్‌లలో ఒకటిగా నిలిచింది. ఐదుగురికి సరిపడా వంటకం తయారీకోసం...


కావలసినవి: గొర్రె పిల్ల కాలు (చిన్న ముక్కలు) - 600 గ్రా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 20 గ్రా, పచ్చి బొప్పాయి పేస్ట్‌- 20 గ్రా, మసాలా దినుసుల పొడి - 2 గ్రా, కసూరీ మెతీ- 10 గ్రా, ధనియాల పొడి-  6 గ్రా, నిమ్మరసం - ఒక గ్రా, నల్లమిరియాలు - 5 గ్రా, వేయించిన ఉల్లి- 25గ్రా, జీడిపప్పు- 15గ్రా, నెయ్యి- 20గ్రా, చాట్‌ మసాలా- 5 గ్రా, ఉప్పు- తగినంత, పుదీనా చట్నీ పేస్టు - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా మాంసానికి అల్లం వెల్లుల్లి పేస్ట్‌, బొప్పాయి పేస్ట్‌, నిమ్మరసం, ఉప్పు, మసాలా దినుసుల పొడి కలిపి నానబెట్టాలి. దాదాపు 40 గంటలు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత మరో మారు జీడిపప్పు, మిరియాల పొడి, వేయించిన ఉల్లిపాయలు కూడా కలిపి మరలా మారినేట్‌ చేయాలి. రాత్రంతా మారినేషన్‌లో ఉంచాలి. ఆ తరువాత ధనియాల పొడి, కసూరీ మెతీ, పుదీనా చట్నీ పేస్టు కలపాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఓ గ్రానైట్‌ రాయిపై కొద్దిగా నెయ్యి వేసి దానిని వేడి చేసి శుభ్రం చేయాలి. అనంతరం మరోమారు నెయ్యి వేసి సిద్ధం చేసి పెట్టుకున్న మాంసం వేసి ఉడికించాలి. అనంతరం కొద్దిగా చాట్‌ మసాలా చల్లి సర్వ్‌ చేసుకోవాలి.


Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.