పత్తి రైతులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T06:28:54+05:30 IST

పత్తి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి కోరారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి రైతులతో కలిసి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై పత్తిని తక్కువ ధరకు కొను గోలు చేస్తున్నారని తెలిపారు.

పత్తి రైతులకు న్యాయం చేయాలి
కొండమల్లేపల్లిలో రైతు సమస్యలు తెలుసుకుంటున్న ఆచారి

 జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి 

కొండమల్లేపల్లి, డిసెంబరు 1: పత్తి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి కోరారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి రైతులతో కలిసి మాట్లాడి  సమస్యలు  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పత్తి రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై  పత్తిని తక్కువ ధరకు   కొను గోలు చేస్తున్నారని తెలిపారు. తేమశాతం అధికంగా ఉందని, పత్తి రంగుమారిందని అధికారులు కొర్రీలు పెడుతూ క్వింటాల్‌కు  10 కిలోల వరకు కోత విధి స్తున్నారని తెలిపారు. ఈ విషయపై మార్కెట్‌ కార్య దర్శి రాంనాథరావును ఆచారి అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ బ్రాంచి సీసీఐ డీజీ ఎంకు ఆచారి ఫోన్‌ చేసి రైతుల సమస్యలను వివ రించారు. తేమ శాతం అధికంగా ఉందని, రంగు మారిందని రైతుల పత్తిని కోతను విధిస్తున్న మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  హైదరాబాద్‌ కాటన్‌మిల్లుకు ఆచారి వెళ్లి కొనుగోళ్లను పరిశీలించారు.  అక్కడ ఉన్న రైతులను అడిగి  సమ స్యలు తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ నాయ కులు ఆచారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, వ్యవసాయశాఖ జిల్లా అధికారి శ్రీకాంత్‌, సీఐ పరశురాం, ఎంపీడీవో బాలరాజురెడ్డి, తహసీ ల్దార్‌ సరస్వతి, ఎంపీటీసీ చనగోని శివగౌడ్‌, నేనావత్‌ లక్ష్మణ్‌, వరికుప్పల వెంకటయ్య పాల్గొన్నారు. 

వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలి: మట్టయ్య

మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని ఏఐకెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య అన్నారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ కమిటీ పిలుపు మేరకు మంగళవారం డిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ప్రకటించారు. కేంద్రం మొండివైఖరికి నిరసనగా ఏఐ కేఎఫ్‌, ఏఐకేఎస్‌, టీఎస్‌కేఎస్‌ రైతుసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చొనినిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి చౌకగా కొనుగోలు చేసి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. పంటకు మద్దతు ధర స్థిరీకరణ, సంక్షేమం, బడ్జెట్‌ కేటాయింపులపై వివ రణలు లేకుండా మార్కెట్లలో దళారులు బాగుపడే చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఆరు రోజులుగా మూడు వ్యవసాయ చట్టా లను రద్దుచేయాలని, నూతన విద్యుత్‌ చట్టాన్ని రద్దు చేయాలని కోరు తూ లక్షలాది రైతులు డిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, టీఎస్‌కేఎస్‌ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, వస్కుల సైదమ్మ, మల్లు గౌతంరెడ్డి, సయ్యద్‌, ఇంద్రారెడ్డి, రాంరెడ్డ్డి, గోపి, మల్లయ్య, జ్యోతి పాల్గొన్నారు.

చిట్యాలలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన

చిట్యాల: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు జిట్ట నగేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం చిట్యాలలో రైతు సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించి వారి కోరికలను నేరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనకు పార్టీల కతీతంగా మద్దతు పలకాలనీ కోరారు.  కార్యక్రమంలో ఐతరాజు నర్సిం హ, పామునగుల్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు, రుద్రారపు పెద్దు లు, జోగు లక్ష్మయ్య, వడ్డెపల్లి ఎల్లయ్య పాల్గొన్నారు.

 చట్టాల ప్రతులు దహనం 

 మర్రిగూడ: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను అమల్లోకి తెచ్చిందంటూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో  ఆ చట్టాల ప్రతులను దహ నం చేశారు.  మర్రిగూడ చౌరస్తాలో కేంద్ర  ప్రభుత్వానికి వ్యతి రేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  సీపీఐ, సీపీఎం నాయ కులు ఆకుల వెంకట్రాం, బూడిద సురేష్‌ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నీలకంఠ రాములు, ఏర్పుల యాద య్య, బుర్ర శేఖర్‌, రామలింగం, ఆకుల రఘుమయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T06:28:54+05:30 IST