
పాటియాలా(పంజాబ్): పాటియాలా నగరంలో ఖలిస్థాన్ వ్యతిరేక ర్యాలీ ఘర్షణల అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 11 గంటలపాటు కర్ఫ్యూ విధించారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటియాలా జిల్లాలో 11 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అయితే అన్ని అత్యవసర, అవసరమైన సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని కోర్టు తెలిపింది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాటియాలా ఘర్షణలపై తక్షణ విచారణకు ఆదేశించారు.ఈ ఘర్షణకు పాల్పడిన నిందితులలో ఎవరినీ విడిచిపెట్టవద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులను సీఎం మాన్ ఆదేశించారు.
హింసాత్మక ఘర్షణల తరువాత పాటియాలాలో శాంతిభద్రతల పరిస్థితిని సీఎం మాన్ రాష్ట్ర సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ముఖ్యమంత్రి మాన్ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరం అప్‌డేట్ చేయాలని డీజీపీని ఆదేశించారు.పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించేందుకు ఎవరినీ అనుమతించబోమని భగవంత్ మాన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి