ఫైజర్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్.. వ్యక్తికి ముఖ పక్షవాతం!

ABN , First Publish Date - 2021-07-20T17:03:50+05:30 IST

కరోనా నుంచి రక్షణ కోసం తీసుకున్న ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది.

ఫైజర్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్.. వ్యక్తికి ముఖ పక్షవాతం!

లండన్: కరోనా నుంచి రక్షణ కోసం తీసుకున్న ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది. ఈ ఘటన యూకేలో వెలుగు చూసింది. ఒక 61 ఏళ్ల వ్యక్తి తొలి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తన ముఖంలో ఎడమవైపు భాగంలో ఇబ్బంది వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేశారు. కోలుకున్న కొన్ని రోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఈ వ్యాధి మరింత ముదిరింది. ఆహారం మింగాలన్నా, ఎడమ కన్ను మూయాలన్నా కూడా కష్టసాధ్యంగా మారింది. మరోసారి ఆస్పత్రి తలుపులు తట్టగా చికిత్స చేసిన వైద్యులు.. ఈ వ్యక్తికి ఇలా జరగడానికి ఫైజర్ వ్యాక్సినే కారణమని తేల్చారు. అయితే ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్‌పై చేసిన ఒక అధ్యయనంలో ఇలా బెల్స్ పాల్సీ వంటి సైడ్ ఎఫెక్టులు రావడం చాలా అరుదుగా సంభవిస్తుందని తేలింది. కేవలం 0.02శాతం మందిలో మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.

Updated Date - 2021-07-20T17:03:50+05:30 IST