monkeypox: ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు...ఆసుపత్రిలో చేరిక

ABN , First Publish Date - 2022-07-27T14:03:14+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో(Delhi) మంకీపాక్స్(monkeypox) అనుమానిత కేసు తాజాగా వెలుగుచూసింది...

monkeypox: ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు...ఆసుపత్రిలో చేరిక

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో(Delhi) మంకీపాక్స్(monkeypox) అనుమానిత కేసు తాజాగా వెలుగుచూసింది.మంకీపాక్స్‌ లక్షణాలతో బాధపడుతున్న మరో వ్యక్తి మంగళవారం రాత్రి ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్‌ఎన్‌జెపి)(LNJP hospital) లో చేరాడు.ఈ రోగికి(Patient) చర్మంపై గాయాలతోపాటు మంకీపాక్స్ వైరస్ లక్షణాల మాదిరిగానే అధిక జ్వరం ఉంది.ఇతని శాంపిల్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. నమూనా నివేదికల కోసం వైద్యాధికారులు వేచి చూస్తున్నారు.ఇప్పటి వరకు భారతదేశంలో నాలుగు మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఒక రోగి ఢిల్లీలో, మూడు కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి.ఢిల్లీలో మూడు రోజుల క్రితం (జులై 24) విదేశీ ప్రయాణ చరిత్ర లేని ఒక రోగికి మంకీపాక్స్ వ్యాధి సోకడంతో మొదటి కేసు నమోదైంది. 


రోగి కూడా నగరంలోని లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రిలో చేరాడు.34 ఏళ్ల రోగి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యారు. జ్వరం, చర్మం గాయాలతో ఆస్పత్రిలో చేరాడు.దేశ రాజధానిలో మంకీపాక్స్ మొదటి కేసు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం లోక్ నాయక్ జై ప్రకాష్ (LNJP) ఆసుపత్రిని అరుదైన వైరల్ ఇన్‌ఫెక్షన్ నిర్వహణకు నోడల్ సెంటర్‌గా మార్చింది. మంకీపాక్స్ వ్యాధిపై ఆసుపత్రిలో వైద్యులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. 

Updated Date - 2022-07-27T14:03:14+05:30 IST