కర్నూలు(హాస్పిటల్),
జూన్ 25: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలో రోగులు ఆకలితో అలమటించారు.
శనివారం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వద్ద డైట్ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం
ఆలస్యం కావడంతో రోగులు అరగంట సేపు పడిగాపులు కాశారు. ఇటీవల కాలంలో డైట్
నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదని రోగు లు మండిపడ్డారు. మెనూ కూడా నాణ్యత
లేదని ఏ మాత్రం భోజనం రుచిగా ఉండడం లేదని రోగులు పేర్కొంటున్నారు.