మట్టితో పని లేకుండా మొక్కల పెంపకం.. Patnaకు చెందిన వ్యక్తి వినూత్న వ్యవసాయం!

ABN , First Publish Date - 2022-06-25T02:43:29+05:30 IST

మట్టి అవసరం లేకుండా పెరిగే కొన్ని మొక్కలను మీరు చూసి ఉంటారు. కానీ, మట్టి లేకుండా మొత్తం వ్యవసాయం చేయడం ఎప్పుడైనా చూశారా?

మట్టితో పని లేకుండా మొక్కల పెంపకం.. Patnaకు చెందిన వ్యక్తి వినూత్న వ్యవసాయం!

మట్టి అవసరం లేకుండా పెరిగే కొన్ని మొక్కలను మీరు చూసి ఉంటారు. కానీ, మట్టి లేకుండా మొత్తం వ్యవసాయం చేయడం ఎప్పుడైనా చూశారా? పాట్నాకు చెందిన ఓ రైతు మట్టితో పని లేకుండా కేవలం నీళ్లతో తన ఇంట్లోనే ఓ తోట పెంచుతున్నాడు. నేల లేకుండా సాగు చేసే పద్ధతిని hydroponic అంటారు. ఈ పద్ధతిలో మొక్కల పెంపకానికి కేవలం నీరు సరిపోతుంది. పాట్నాలోని కంకర్‌బాగ్ కాలనీకి చెందిన మహ్మద్ జావేద్ ఈ టెక్నిక్‌తో తన ఇంటిలోనే చిన్న తోటను సిద్ధం చేశాడు.


ఇది కూడా చదవండి..

గుడిలో ఇచ్చిన తీర్థంతోపాటు పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేసిన భక్తుడు.. డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూస్తే..


జావేద్ చాలా సంవత్సరాలుగా మట్టి లేకుండానే మొక్కలను విజయవంతంగా పెంచుతున్నాడు. అతను హైడ్రోపోనిక్ టెక్నిక్ ఉపయోగించి తన ఇంటిని తోటగా మార్చాడు. ఈ పద్ధతిలో మొక్కలు నీటిలో ఉన్న ఖనిజాలు, పోషకాలను పీల్చుకుని వృద్ధి చెందుతాయి. 30 ఏళ్ల క్రితం తాను పాట్నాలోని ఓ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడినని, హైడ్రోపోనిక్స్‌పై ఆసక్తితో ఉద్యోగం మానేశానని జావేద్ చెప్పాడు. ఉద్యోగం మానేసిన తర్వాత, జావేద్ `బయోఫోర్ట్ ఎమ్‌` అనే రసాయనాన్ని అభివృద్ధి చేశాడు. ఒక లీటరు నీటిలో ఒక మిల్లీలీటర్ బయోఫోర్ట్ ఎమ్‌ను కలపడం ద్వారా ఓ ద్రావణాన్ని తయారు చేస్తారు. 


ఆ ద్రావణంతో 30 నుంచి 40 సెం.మీ ఎత్తు వరకు పెరిగే మొక్కలు ఒక సంవత్సరం పాటు పోషణను పొందుతూనే ఉంటాయి. అంతేకాదు జావేద్.. ప్రత్యేక సేంద్రీయ ఎరువులు కూడా తయారు చేశాడు. ఈ సేంద్రియ ఎరువును గులకరాళ్లు, చిన్న చిన్న రాయి ముక్కలు, ఇసుక మొదలైన వాటితో తయారు చేస్తారు. పట్టణాల్లో నివసించే వారు ఈ పద్ధతి ద్వారా తమ ఇంట్లోనే మొక్కల పెంపకం ప్రారంభిస్తే నగరంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని జావేద్ చెప్పారు. 

Updated Date - 2022-06-25T02:43:29+05:30 IST