ప్రతీ ఒక్కరిలో దేశభక్తి పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-08-12T05:28:55+05:30 IST

ప్రతీ ఒక్కరిలో దేశభక్తి పెంపొందించాలి

ప్రతీ ఒక్కరిలో దేశభక్తి పెంపొందించాలి
కీసరలో జెండా ఊపి ఫ్రీడమ్‌ రన్‌ను ప్రారంభిస్తున్న్లఅదనపు కలెక్టర్‌

వికారాబాద్‌/కీసర, ఆగస్టు11: ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేందుకు స్వాతంత్య్ర వాజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 రోజుల పాటు అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. గురువారం వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ రన్‌ను ఎన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్‌టీఆర్‌ చౌరస్తా వరకు నిర్వహించగా కలెక్టర్‌ నిఖిల జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు గర్వంగా తమ ఇళ్లపై జాతీయజెండాలను ఎగురవేయాలన్నారు.  ఫ్రీడమ్‌ ర్యాలీ, ఫ్రీడమ్‌ కాంపిటేషన్‌ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.   కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎస్పీ కోటిరెడ్డి, చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, ఎంపీపీ చంద్రకళ, అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ జిల్లా కీసరలో...

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఫ్రీడమ్‌ రన్‌ను గురువారం ఘనంగా నిర్వహించారు. కీసర ఆర్డీవో కార్యాలయం నుండి కీసర చౌరస్తా వరకు, అక్కడి నుంచి  కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌ వరకు  ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ ఫ్రీడమ్‌ రన్‌ ఎంతో ఉల్లాసంగా...ఉత్సాహంగా జరిగింది. 2కేరన్‌లో  యువతి, యువకులు పాల్గొన్నారు.  కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, ఏసీపీ రష్మిక పెరమాలు, జెడ్పీసీఈవో దేవ సహాయం, ఆర్‌డీవో రవి, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ నాయకపు మాధురి వెంకటేష్‌, ిసీఐ రఘువీర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:28:55+05:30 IST