స్వాతంత్య్ర వజ్రోత్సవాల ద్వారా దేశభక్తిని పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:31:28+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల ద్వారా దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని మూడోతరంలో పెంపొందించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ మునిసిపాలిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల ద్వారా దేశభక్తిని పెంపొందించాలి
జిల్లాకేంద్రంలో తిరంగా జెండాలను పంపిణీ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

 పట్టణంలో ఇంటింటికి జాతీయ పతాకాన్ని పంపిణీ చేసిన మంత్రి 


నల్లగొండ టౌన్‌, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ద్వారా దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని మూడోతరంలో పెంపొందించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ మునిసిపాలిటీలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గాంధీ నాయకత్వంలో అహింసా పద్ధతిలో పోరాటం చేసి స్వాతంత్య్రం సాధించుకున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని,  దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి, దేశభక్తిని చాటేలా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి జెండాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ఇంటింటా జాతీయపతాకం ఎగరవేసి దేశభక్తిని చాటాలన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్‌కార్యాయంలో కౌన్సిలర్లకు జాతీయపతాకాలు అందజేశారు. 


ఇంటింటికీ జాతీయపతాకాల పంపిణీ

నల్లగొండలోని 47వ వార్డులో జాతీయపతాకాల పంపిణీని మంత్రి జగదీష్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సమైక్యతా భావాన్ని ప్రతీఒక్కరి మదిలో నాటింపచేసేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు.  


రూ.5కు భోజనం ప్రారంభం

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం పక్కన మునిసిపాలిటీ ద్వారా ఏర్పాటుచేసిన ఎమిరాల్డ్‌ పార్కును మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభించారు. అక్కడే మునిసిపాలిటీ ద్వారా పేదలకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటిన్‌ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు కంచర్లభూపాల్‌రెడ్డి, ఎన్‌.భాస్కర్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ రెమారాజేశ్వరీ, డీఆర్‌వో జగదీశ్వర్‌రెడ్డి, కమిషనర్‌రమణాచారి పాల్గొన్నారు. 


వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: ఎస్పీ రెమారాజేశ్వరీ

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎస్పీ రెమారాజేశ్వరీ కోరారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన 2కే  ఫ్రీడం రన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 2కే రన్‌ ఉదయం 8 గంటలకు పోలీ్‌స పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు. అలాగే అన్ని స్టేషన్ల పరిధిలో ఒకే సమయంలో ప్రారంభించాలన్నారు. ఈ నెల 16వ తేదీన జాతీయ గీతాలాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రావు, సురే్‌షకుమార్‌, వెంకటరమణ, సీఐ రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-10T06:31:28+05:30 IST