పావ్‌బాజీ దోశ

ABN , First Publish Date - 2022-04-22T20:51:51+05:30 IST

దోశ పిండి- కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- 3 స్పూన్లు, టొమాటో ముక్కలు- కప్పు, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్‌, బఠానీ (ఉడికించినవి) - కప్పు , టొమాటో

పావ్‌బాజీ దోశ

కావలసిన పదార్థాలు: దోశ పిండి- కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- 3 స్పూన్లు, టొమాటో ముక్కలు- కప్పు, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్‌, బఠానీ (ఉడికించినవి) - కప్పు , టొమాటో సాస్‌- 6 స్పూన్లు, కొబ్బరి చట్నీ-  3 స్పూను, చిల్లీ సాస్‌- 6 స్పూన్లు, పావ్‌బాజీ మసాలా పొడి- అర స్పూను, వెన్నె- 2 స్పూన్లు, కొత్తిమీర తరుగు- 2 స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: పెనం మీద గరిటె పిండితో దోశెలా వేసుకోవాలి. దానిపై రెండు స్పూన్ల ఉల్లి, క్యాప్సికమ్‌, టొమాటో ముక్కలు పరచాలి. ఉడికించిన కూరగాయలు కూడా చేర్చాలి. పైన రెండు స్పూన్ల టొమాటో సాస్‌, కొబ్బరి చట్నీ, చిల్లీ సాస్‌, మసాలా పొడి, కాస్త ఉప్పు, వెన్నె కూడా వేసి బాగా కలపాలి. దోశపైనంతా కూర ఉండేలా చేయాలి. మరి కాసేపు కూరగాయలన్నీ మగ్గేలా చేసి సగానికి మడిస్తే పావ్‌బాజీ దోశ రెడీ. 

Updated Date - 2022-04-22T20:51:51+05:30 IST