Pawan Kalyan: పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా?

ABN , First Publish Date - 2021-07-11T00:07:44+05:30 IST

రాష్ట్రంలోని తెలుగు అకాడెమీ పేరును మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా అని ప్రభుత్వాన్ని

Pawan Kalyan: పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా?

అమరావతి: రాష్ట్రంలోని తెలుగు అకాడెమీ పేరును మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా అని ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటన్నారు. సంస్కృత భాష అభివృద్ధి కోసమైతే ప్రత్యేక అకాడెమీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అకాడెమీని అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని ఆయన ఆరోపించారు. తెలుగు, సంస్కృత అకాడెమీ అని ఎందుకు హడావిడిగా మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, అకాడెమీ బాధ్యులు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అకాడెమీ పేరు మారిస్తే భాష అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.


 సంస్కృత భాష అభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకొంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడెమీ ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం అధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడెమీలాంటిది ఇక్కడా ప్రారంభించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాడెమీ పేరు మార్పు నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఆయన కోరారు. తెలుగు అకాడెమీ అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-07-11T00:07:44+05:30 IST