ఆ చిన్నారులకు తల్లిని దూరం కానివ్వద్దు...

Jan 22 2021 @ 18:04PM

"ఏడు నెలల క్రితం పావని గర్భిణి... ఆమె ఆరోగ్యం కోసం ప్రతి రోజూ ప్రార్థిస్తూ ఎంతో ఉత్కంఠతో ఉన్నాం. ఇప్పుడు పావనికి పుట్టిన పాపాయి ఎన్ఐసీయూలో ఉంది... పావని ప్రాణాపాయ స్థితిని ఎదుర్కుంటోంది. ఇదెలా జరిగింది?"


31 ఏళ్ళ పావని, ఆమ భర్త విష్ణు దంపతులకు 12 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. ఈ జంటకు 10 సంవత్సరాల వయసున్న బాబు కూడా ఉన్నాడు. ఆ అబ్బాయంటే వీరికి పంచప్రాణాలు. అయితే, ఒక చిట్టి పాపాయితో తమ ఇల్లు కళకళలాడాలని వారు ఎన్నో కలలు కన్నారు. ఏప్రిల్ 2020లో పావని గర్భవతి అయినప్పుడు చివరికి తమ కలలు నెరవేరాయని ఎంతో సంతోషించారు.

ఒక ఫార్మాసుటికల్ కంపెనీలో పనిచేస్తున్న విష్ణు ఆదాయం నెలకు రూ.9000 మాత్రమే... ఈ మొత్తం కేవలం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి బొటాబోటీగా సరిపోతుంది. అక్టోబర్ 2020 వరకూ ఎలాగో ఆ చిన్ని మొత్తంతోనే సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు.


ఒకరోజున పావని జ్వరంతో బాధపడుతూ, ఒళ్ళంతా నొప్పులతో బాధ అనుభవించాల్సి వచ్చింది. మామూలు మందులేవీ పనిచెయ్యకపోవడంతో పావనిని విష్ణు, ఆమె అత్తగారు కలసి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు నిర్వహించిన టెస్ట్‌ల ఫలితాలు వారి జీవితాన్ని రాత్రికి రాత్రే తల్లకిందులు చేశాయి.

పావనికి బ్లడ్ క్యాన్సర్ అని ఆ టెస్ట్‌లలో తేలింది. "డాక్టర్లు మొదట ఈ విషయం నాకు చెప్పారు. నేను కన్నీళ్ళు ఆపుకోలేక మా అమ్మ దగ్గరకెళ్ళాను. గర్భవతి అయిన నా భార్య అసలు ఏ పరిస్థితిలో ఉందో నాకు అర్థం కాలేదు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఏమవుతుంది? నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నావని నా భార్యకు ఎలా చెప్పగలను? నా కొడుక్కి ఏం చెప్పాలి..." విష్ణు అనుభవిస్తున్న నరకయాతన ఇది.


మరోవైపు తీవ్ర భయాందోళనలో ఉన్న పావని అసలేం జరుగుతోందో తనకు చెప్పమని భర్త విష్ణుని ప్రాధేయపడింది. తీవ్ర మానసిక వేదనలో ఉన్న విష్ణు కన్నీరు ఆపుకోలేక ఆమె క్యాన్సర్‌కు గురైన విషయం చెప్పాడు. దురదృష్టం ఏమిటంటే... మరింత దారుణమైన పరిస్థితి ముందుంది.


విరాళాలు ఇచ్చేందుకు  ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు పావనికి క్యాన్సర్ చికిత్స ప్రారంభించడం కోసం డాక్టర్లు ఆమెకు ఎమర్జెన్సీ సి-సెక్షన్ నిర్వహించారు. పావని చిన్నారి పాపకు జన్మనిచ్చింది కానీ, నెలలు నిండక ముందే పుట్టడంతో ఎన్ఐసీయుకి తరలించారు. ఆ పసికందు ఇంకా అక్కడే ఉంది. తన చిట్టిపాపాయిని పావని ఇంకా చూడనే లేదు.


పావని క్షేమంగా బయటపడాలంటే ఆమెకు కీమోథెరపీ జరగాల్సి ఉంది. ఇందుకు అవసరమైన డబ్బు కోసం విష్ణు, తన తల్లి తమకున్నదంతా అమ్ముకున్నారు. అప్పు కోసం తమ చుట్టాలు, స్నేహితులను వేడుకున్నారు. కానీ, ఆ మొత్తం చాలదు. వారికి ఇప్పుడు అత్యవసరంగా ధన సహాయం కావాలి.


"మేం ఆర్థికంగా ఉన్న వాళ్ళం కాదు కానీ, ఉన్నదానితోనే సంతృప్తిగా బతుకుతున్నాము. కేవలం డబ్బు లేకపోవడం వల్ల పావని ప్రాణానికే ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవడం దారుణాతి దారుణం. దయచేసి మాకు సాయం చెయ్యండి. పావని కూతురు తన తల్లి ప్రేమను పొందాలి" అని విష్ణు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు.


పావనికి కీమోథెరపీ కోసం రూ.20,00,000 ఖర్చవుతుంది. విష్ణు కుటుంబానికి ఇది భరించలేనంత పెద్ద మొత్తం. పావని క్యాన్సర్‌ని జయించేందుకు ఉదార హృదయంతో విరాళాలు ఇవ్వండి. ఆమె పిల్లలు తల్లికి దూరమయ్యే పరిస్థితిని రానివ్వద్దు. మీరిచ్చే విరాళంలోని ప్రతి పైసా పావని చికిత్స కోసమే ఉపయోగించడం జరుగుతుంది.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.