తెలుగులోనే కాదు అక్కడా హిట్టే!

ABN , First Publish Date - 2022-02-20T05:30:00+05:30 IST

తన కెరీర్‌ ప్రారంభం నుంచీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విక్టరీ వెంకటేశ్‌ చేసిన మరో డిఫరెంట్‌ ఫిల్మ్‌ ‘పవిత్రబంధం’. ఫారిన్‌ కల్చర్‌లో పెరిగిన ఓ యువకుడికి జీవితం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటో తెలియజెప్పిన సినిమా ఇది.

తెలుగులోనే కాదు అక్కడా హిట్టే!

తన కెరీర్‌ ప్రారంభం నుంచీ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విక్టరీ వెంకటేశ్‌ చేసిన మరో డిఫరెంట్‌ ఫిల్మ్‌ ‘పవిత్రబంధం’. ఫారిన్‌ కల్చర్‌లో పెరిగిన ఓ యువకుడికి జీవితం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటో  తెలియజెప్పిన సినిమా ఇది. ఇందులో హీరోకి పెళ్లి, సంసారం.. ఇవేమీ నచ్చవు. తండ్రి (గాయకుడు బాలు ఈ పాత్ర పోషించారు) పోరు పడలేక ఓ యువతిని పెళ్లి చేసుకుంటాడు. అది కూడా కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌. ఏడాది దాటిన తర్వాత భార్య ఎవరో, భర్త ఎవరో! సినిమాలో వెంకటేశ్‌ పెట్టిన కండిషన్స్‌కు సౌందర్య ఒప్పుకొని ఈ కాంట్రక్ట్‌ మ్యారేజ్‌కు అంగీకరిస్తారు. ఏడాది దాటిన తర్వాత వెంకటేశ్‌లో  ఎటువంటి మార్పు వచ్చిందనేది మిగిలిన కథ. ఇటువంటి సబ్జెక్ట్‌ చేయడం నిజంగా రిస్కే. కానీ వైవిధ్యమైన పాత్రలను కోరుకొనే వెంకటేశ్‌ కథ విన్న వెంటనే  అంగీకరించి చేయడం విశేషం.


ఈ సినిమాలో ఫస్ట్‌ నైట్‌ సీన్‌లో సౌందర్య వెంకటేశ్‌ కాళ్లకు నమస్కరిస్తుంది. ఆమె పైకి లేవగానే వెంకటేశ్‌ కూడా కిందకు వంగి ఆమె కాళ్లకు నమస్కరిస్తారు. ఇదే స్టిల్‌తో 24 షీట్‌ పోస్టర్‌ వేస్తే అది వైరల్‌ అయింది. 


ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌ అయింది. ఆరు భాషల్లోకి రీమేక్‌ చేస్తే అక్కడ కూడా హిట్టే.

Updated Date - 2022-02-20T05:30:00+05:30 IST