Advertisement

పవన్-రానా.. డైరెక్టర్ ఎవరు?

Oct 7 2020 @ 15:19PM

మలయాళంలో విజయంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్` సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. సీనియర్ హీరో బాలయ్యతో ఈ సినిమాను రీమేక్ చేయాలని నిర్మాత ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కుదరలేదు. దీంతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ లైన్‌లోకి వచ్చారు. ఈ రీమేక్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 


`అయ్యప్పన్ కోషియమ్` మల్టీస్టారర్ చిత్రం. ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం యంగ్ హీరో దగ్గుబాటి రానాను సంప్రదించారట. ఆయన కూడా దాదాపు ఓకే అనబోతున్నట్టు తెలుస్తోంది. పవన్‌తో నటించేందుకు రానా కూడా సిద్ధంగానే ఉన్నాడట. అయితే డైరెక్టర్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పవన్-రానా కాంబినేషన్‌ను డీల్ చేయగల డైరక్టర్ ఎవరనేది ఇంకా తేలలేదు. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని వంటి దర్శకుల పేర్లు వినబడుతున్నాయి. మరి, ఈ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.