వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌

ABN , First Publish Date - 2022-03-15T02:42:18+05:30 IST

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ క్లారిటీ ఇచ్చారు. జిల్లాలోని ఇప్పటంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమంటూ ఆయన స్పష్టత ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పవన్‌ చెప్పకనే చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత లాభాలు పక్కనపెట్టి.. పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2022-03-15T02:42:18+05:30 IST