జనసేన ముందు మూడు ఆప్షన్లులున్నాయన్న Pawan.. అవేంటంటే.

ABN , First Publish Date - 2022-06-05T01:15:31+05:30 IST

బీజేపీ- జనసేన (BJP Janasena) బంధం గట్టిగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పష్టం చేశారు.

జనసేన ముందు మూడు ఆప్షన్లులున్నాయన్న Pawan.. అవేంటంటే.

అమరావతి: బీజేపీ- జనసేన (BJP Janasena) బంధం గట్టిగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పష్టం చేశారు. కొంత సోషల్ డిస్టెన్స్ వచ్చిందని, ఇప్పుడది పోయిందని తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ నేతలతో కూడా చర్చించానని వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలెవరూ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై తనను అందరూ అడుగుతున్నారని చెప్పారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతానని ప్రకటించారు. రాష్ట్రం కోసం చాలాసార్లు తగ్గానని, ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. 2014, 2019లో తగ్గాం.. 2024లో తగ్గేదే లేదని పవన్ తేల్చిచెప్పారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయని పేర్కొన్నారు.


పవన్ చెప్పిన ఆ మూడు ప్రత్యామ్నాయాలివే

1. జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. 

2. జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వం స్థాపించడం. 

3. జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం.

ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని, మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తిని పవన్ గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ సూచించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పొత్తు నేపథ్యంలో... తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందనేది ఎవరి ఆశ అయినా కావొచ్చునని పవన్‌ వ్యాఖ్యానించారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ... ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ... ‘‘ఒంటరిగా పోటీ చేసే మీకు... ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?’’ అని పవన్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-05T01:15:31+05:30 IST