ఆ వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది: Pawan

ABN , First Publish Date - 2022-07-07T17:34:39+05:30 IST

రాజ్యసభ(Rajyasabha)కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా(Ilayaraja), ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)

ఆ వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది: Pawan

Amaravathi : రాజ్యసభ(Rajyasabha)కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా(Ilayaraja), ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad), వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉష(P.T.Usha) సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నలుగురూ తమ తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేశారని కొనియాడారు. వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)కి, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి? అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని.. ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-07T17:34:39+05:30 IST