‘పవన్‌ కల్యాణ్ హెల్త్ బులెటిన్ ప్లీజ్‌‌’

May 4 2021 @ 18:41PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా అధికారికంగా తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయిందనే ప్రకటన తర్వాత.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఇంత వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు. అయితే రీసెంట్ గా 'వకీల్ సాబ్' డైరెక్టర్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడిందని తెలియజేశారు. అయితే పవన్ ఆరోగ్యంపై  ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, మెగాభిమానులు సోషల్‌ మీడియా వేదికగా.. 'పవన్‌ కళ్యాణ్ హెల్త్ బులెటిన్‌ ప్లీజ్‌' అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్‌తో పాటు ఊపిరితిత్తులలో నిమ్ము చేరినట్లుగా మొదట విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఆ తర్వాత జనసేన పార్టీ ప్రెస్‌నోట్‌లో 'నా ఆరోగ్యం కుదుటపడుతుంది' అనే పవన్‌ కళ్యాణ్ స్టేట్‌మెంట్‌ తప్ప.. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంత వరకు విడుదల చేయలేదు. అందుకేనేమో ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ.. సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ కావాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరి వారి కోరిక మేరకైనా.. పవన్‌ కళ్యాణ్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తారేమో చూద్దాం.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.