Advertisement

బండ్ల గణేశ్‌ నిర్మాణంలో పవన్‌కల్యాణ్‌ 30

Sep 29 2020 @ 01:27AM

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా ‘తీన్‌మార్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రాలను బండ్ల గణేశ్‌ నిర్మించారు. భవిష్యత్తులో వీళ్లిద్దరి కలయికలో మూడో చిత్రం రానుంది. ఈ విషయాన్ని సోమవారం బండ్ల గణేశ్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నా బాస్‌ ఓకే అన్నారు. మరోసారి నా కలలు నిజం అయ్యాయి. థ్యాంక్యూ మై గాడ్‌.. పవన్‌కల్యాణ్‌. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తా. పవన్‌ కల్యాణ్‌ 30వ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని బండ్ల గణేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొన్నారు. దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ సహా క్రిష్‌ దర్శకత్వంలో మరో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. కరోనా వల్ల వాటికి అంతరాయం ఏర్పడింది. ఆ రెండూ కాకుండా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మరొక చిత్రం అంగీకరించారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.