చాతుర్మాస్య దీక్షలో పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2022-07-11T01:31:01+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. నాలుగు నెలలపాటు ఆయన ఈ దీక్షలో కొనసాగుతారు.

చాతుర్మాస్య దీక్షలో పవన్‌ కల్యాణ్‌

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చాతుర్మాస్య దీక్ష చేపట్టారు. నాలుగు నెలలపాటు ఆయన ఈ దీక్షలో కొనసాగుతారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో పవన్‌ ఈ దీక్షలో ఉంటారు. ఈ నాలుగు నెలలపాటు ఆయన ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటారు. రాత్రిపూట అల్పాహారం తీసుకుంటారు. కనకదుర్గమ్మ అనుగ్రహం కోసం ఈ దీక్షలను చేస్తుంటారు. కొంతమంది 11 రోజులు దీక్షలో ఉంటారు. మరికొంతమంది 31రోజులపాటు దీక్ష చేస్తారు. పవన్‌ నాలుగు నెలలపాటు ఈ దీక్షలో ఉంటారు.

Updated Date - 2022-07-11T01:31:01+05:30 IST