స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలి: పవన్‌

ABN , First Publish Date - 2022-08-15T00:43:51+05:30 IST

స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలి: పవన్‌

గుంటూరు: స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో సమస్యలపై పోరాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. మంగళగిరిలో జనసేన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ పదవి అనేది మన వెంట రావాలని, పదవుల కోసం వెంపర్లాడవద్దన్నారు. సంస్థలు, వ్యక్తులు మోసం చేయడం కాదని, ఏపీలో ప్రభుత్వమే మోసం చేస్తోందని దుయ్యబట్టారు. మద్యనిషేధం, ఉద్యోగాల విషయంలో మాటమార్చారని ఆయన తప్పుబట్టారు. తన కోసం తాను ఎప్పుడూ భయపడలేదని, భవిష్యత్ తరాల కోసమే తన ఆరాటమని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.

Updated Date - 2022-08-15T00:43:51+05:30 IST