కోనసీమ వివాదం రాజకీయ కుట్ర: పవన్‌ కల్యాణ్

ABN , First Publish Date - 2022-06-04T00:50:00+05:30 IST

కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌

కోనసీమ వివాదం రాజకీయ కుట్ర: పవన్‌ కల్యాణ్

అమరావతి: కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీలో రెండువర్గాల గొడవను కులఘర్షణగా మార్చారని దుయ్యబట్టారు. కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందన్నారు. సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్‌ విధానమన్నారు. 


‘‘ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్‌ వస్తే అరాచకమే. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. YSR ప్రభుత్వంలో Y అంటే యువజనులకు ఉపాధి లేదు. S అంటూ శ్రామికులకు ఉన్నపని తీసేశారు. R అంటే రైతులకు మద్దతుధర లేదు. ఇక YSR పేరు ఆ పార్టీకి ఎందుకో‌ వారే చెప్పాలి?.. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం పోలవరం పూర్తికాదు. కేంద్ర సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు’’ అని పవన్‌కల్యాణ్ ఆరోపించారు.

Updated Date - 2022-06-04T00:50:00+05:30 IST