Pawan Kalyan: ప్రొఫెసర్‌గా కనిపిస్తారా..?

Published: Sat, 21 May 2022 08:20:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Pawan Kalyan: ప్రొఫెసర్‌గా కనిపిస్తారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పలు భారీ సినిమాలను కమిటైన  సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ (Vakeel Saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) చిత్రాలతో హిట్స్ అందుకున్న ఆయన ఇప్పుడు దర్శకుడు క్రిష్ (Krish) దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) అనే భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం (A M Rathnam) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్‌గా.. బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఈ సినిమాను పూర్తి చేసి డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాని చేయనున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో పవన్ పాత్రను రివీల్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇందులో పవన్ ప్రొఫెసర్‌గా పాత్రలో కనిపిస్తారని, ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. పవన్ కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటిసారి. వకీల్ సాబ్ సినిమాలో లాయర్ పాత్రలో అదరగొట్టిన పవన్.. ఇప్పటికే పోలీస్ పాత్రల్లోనూ నటించి భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్‌ పాత్రలో నటించబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగిపోయింది. కాగా, ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించబోతోంది. ఇక పవన్ కమిటైన సినిమాలలో సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న ప్రాజెక్ట్, బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా కూడా ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International