పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్‌కళ్యాణ్‌

ABN , First Publish Date - 2022-02-25T14:36:41+05:30 IST

పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్‌కళ్యాణ్‌

పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్‌కళ్యాణ్‌

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌లో భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ పోలీసు యంత్రాంగానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, జన సామాన్యానికి అవాంతరాలు లేకుండా చేయడంలో, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నగర సీపీ సీవీ ఆనంద్‌, ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌, వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయెల్‌ డేవిస్‌లతోపాటు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్న అభిమానులు ఇదే క్రమశిక్షణను, స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

Updated Date - 2022-02-25T14:36:41+05:30 IST